బరువు తగ్గాలంటే ఈ డ్రింక్ బెస్ట్.. కిలోలు కిలోలు తగ్గుతారు!
ప్రస్తుత సమాజంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక ఊబకాయంతో బాధపడేవారు బరువు తగ్గడానికి నానా చావు చూస్తున్నారు. డైటింగ్ చేయడం, ఎక్ససైజ్ చేయడం, జిమ్ లకు వెళ్లడం వంటివి చేస్తున్నా బరువు తగ్గడం లేదని తెగ బాధపడుతున్నారు. అయితే ఈజీగా బరువు తగ్గాలని భావించేవారు ఒక పానీయాన్ని రోజు తాగితే కిలోలు కిలోలు బరువు తగ్గుతారని డైటీషియన్లు చెబుతున్నారు.
ఈ దేశీ డ్రింక్ తో బరువుకు చెక్
బరువు తగ్గాలని భావించేవారు ఒక ప్రత్యేకమైన దేశీ డ్రింక్ ను తాగితే మంచిది. ఈ పానీయం బరువు తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇక ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడానికి వాము, సోంపు, దాల్చిన చెక్క, అల్లం చిన్న ముక్క తీసుకొని వీటిని రాత్రిపూట నీళ్లలో నానబెట్టాలి. ఉదయం ఈ నీటిని అర లీటర్ నీళ్లలో పోసి అది 250 గ్రాములు అయ్యేవరకు మరిగించాలి.

ప్రతిరోజూ రెండు సార్లు తాగితే బరువు తగ్గుతారు
ఆ తర్వాత చల్లార్చి ప్రతిరోజూ రెండు సార్లు తాగితే ఇది మన శరీరంలో ఉన్న చెడు కొవ్వు కరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పానీయం మన శరీరంలోని జీవక్రియను సమతుల్యం చేస్తుంది. కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇక ఈ పానీయాన్ని తీసుకుంటూ ఆహారంలో ప్రోటీన్స్ శాతాన్ని పెంచి, కార్బోహైడ్రేట్స్ ను తగ్గించి, క్యాలరీల వినియోగాన్ని తగ్గించడం ద్వారా బరువు తగ్గవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు.
ఈ దేశి డ్రింక్ ను ఒక్కసారి ట్రై చేయండి
అంతేకాదు ప్రతిరోజు క్రమం తప్పకుండా 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, యోగా చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని ఇస్తున్నారు.సరైన ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ప్రతిరోజు ఈ డ్రింక్ ను రెండు సార్లు తాగడం చేస్తే తప్పనిసరిగా బరువు తగ్గుతారని ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలని భావించేవారు ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు మనకు మంచి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే ఈ దేశి డ్రింక్ ను ఒక్కసారి ట్రై చేయండి.












Click it and Unblock the Notifications