రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయటానికి నేచురల్ గా ఇలా చేస్తే చాలు!
ప్రస్తుతం సమాజంలో అత్యంత భయంకరంగా పట్టిపీడిస్తున్న అనారోగ్య సమస్యలలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్య డయాబెటిస్ ఒకటి. డయాబెటిస్ వచ్చిందంటే చెట్టుకు చెదలు పట్టినట్టే అని, ఆరోగ్యం పైన దృష్టి పెట్టకుంటే శరీర అవయవాలు ఒక్కొక్కటిగా పాడైపోతాయి అని పెద్దలు చెబుతారు. అందుకే ప్రతి ఒక్కరూ డయాబెటిస్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ కోసం ఇలా చెయ్యండి
బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు డయాబెటిస్ కి చెక్ పెట్టడానికి నేచురల్ చిట్కాలను పాటిస్తే మంచిది. మరి ఆ చిట్కాలను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.డయాబెటిస్ తో బాధపడేవారు రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే రాగి పాత్రలో నీటిని తాగాలి. ఇలా రాగి పాత్రలో నీటిని తాగడం డయాబెటిస్ ను నియంత్రించడానికి దోహదం చేస్తుంది.

వీటిని తీసుకుంటే డయాబెటిస్ కు చెక్
డయాబెటిస్ తో బాధపడేవారు ప్రతిరోజు తాము తీసుకునే ఆహారంలో మెంతి పొడిని చేర్చుకోవాలి. మెంతు పొడి రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి దోహదం చేస్తుంది. మెంతులను దోరగా వేయించుకొని, పొడి చేసుకుని పెట్టుకుని ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది.
షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలంటే
చేదుగా ఉండే కాకరకాయలను తరచుగా తినడం చాలా మంచిది. ఉదయాన్నే ఉసిరికాయలు తిన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. మనం తినే ఆహారంలో కరివేపాకును చేర్చుకోవడం, లేదా ఉదయాన్నే రెండు రెమ్మలు కరివేపాకును తినడం డయాబెటిస్ కు చెక్ పెడుతుంది. ఆహారంలో మెంతిపొడి మాత్రమే కాదు దాల్చిన చెక్క పొడి కూడా డయాబెటిస్ ను నియంత్రించడానికి దోహదం చేస్తుంది.
ఇలా చేస్తే డయాబెటిస్ కంట్రోల్ లో
ప్రతిరోజు కనీసం పదివేల అడుగులు వేస్తే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి ఒక మార్గం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయాలి. మనం తీసుకునే ఆహారంలో ఆవాలు, పసుపు, మెంతిపొడి, దాల్చినచెక్క పొడులు రెగ్యులర్ గా ఉపయోగించుకునేలా చూసుకోవాలి. మన ఇంట్లోనే ఉండే ఈ పదార్థాలతో సహజ చిట్కాలను పాటిస్తే డయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చు. రక్తంలో షుగర్ లెవల్స్ ను నియంత్రించవచ్చు.












Click it and Unblock the Notifications