Health Tips: గొంతు నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..
జలుబు లేదా ఫ్లూ రావడం ఈ రోజుల్లో చాలా సాధారణం. అలెర్జీలు, బ్రోన్కైటిస్, పేలవమైన దంత పరిశుభ్రత, నరాల సమస్యలు, సైనసిటిస్, ఇన్ఫెక్షన్ కూడా గొంతు నొప్పికి కారణమవుతాయట. గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. ముఖ్యమైన టిట్కాల్లో లవంగం టీ ఒకటి.

యాంటీ వైరల్
లవంగం అనేది భారతీయ కిచెన్‌లో తప్పకుండా ఉంటుంది. వంటలో లవంగాలు వాడడం వల్ల రుచి పెరగడమే కాదు.. ఆరోగ్యం కూడా బాగుంటుందట. ఇందులో ఉండే యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తాయి. గొంతు నొప్పి బాధపడే వారికి లవంగం టీ చాలా మంచిది. ఇది క్రమం తప్పకుండా తాగడం వల్ల జలుబు-దగ్గు, గొంతులో గరగర, ముక్కు దిబ్బడ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా కడుపులో సమస్య, స్వెల్లింగ్, కడుపులో తిప్పినట్టుండటం వంటి సమస్యలు తగ్గుతాయి.

టీ తయారీ
లవంగం టీ తయారీకు 3 లవంగాలు, ఒక కప్పు నీరు చాలు. ఓ గిన్నెలో ఓ కప్పు నీళ్లు తీసుకుని అందులో 3 లవంగాలు వేసి బాగా ఉడికించాలి. కనీసం 3-5 నిమిషాలు మరిగించిన తరువాత ఆపేయాలి. ఈ మిశ్రమాన్ని వడపోసి రుచి కోసం తేనె కొద్గిగా కలుపుకుని తాగవచ్చు. ఇలా రోజు తాగడం వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.

పసుపు పాలు..
పసుపు ఓ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, ఎన్నో తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కలిగి ఉంటుంది. గొంతు నొప్పి కోసం, మీరు పడుకునే ముందు పసుపు పాలు తాగొచ్చు. మీరు ఓ కప్పు పాలలో చిటెకెడు పసుపు కలపండి. కొద్దిగా నల్ల మిరియాల పొడి కూడా కలపడం అధిక ప్రయోజనాలు ఉంటాయి.

దాల్చిన చెక్క
అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి లేదా చిన్న దాల్చిన చెక్కను 250 ml నీటిలో 5 నిమిషాలు మరిగించండి. ఈ నీటిని ఫిల్టర్ చేసి చల్లారనివ్వాలి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది.












Click it and Unblock the Notifications