కంటి చూపు తగ్గేదేలే .. ఇదిగో పాశుపతాస్త్రం!

సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అటువంటి కళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కాపాడుకోవడానికి ముఖ్యంగా ఆహారం పైన శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. మనం తినే ఆహారం మన కంటి ఆరోగ్యానికి ఏ విధంగా దోహదం చేస్తుంది? కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి తినాలి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

కళ్ళ ఆరోగ్యం కోసం ఇవి తినండి

కంటి ఆరోగ్యానికి ముఖ్యంగా ఆకుకూరలు తినాలి. ఆకుకూరల్లో విటమిన్ ఏ ఉంటుంది. పాలకూర, బచ్చలి కూర, తోటకూర వంటి ఆకుకూరలలో లుటిన్, జియాక్సంతిన్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తినడం కూడా కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నారింజ, బత్తాయి, నిమ్మ వంటి పండ్లు విటమిన్ సి తో కూడుకొని ఉంటాయి. ఈ పండ్లను తినడం కంటిలోని నా రక్తనాళాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

Top Indian Foods To Naturally Boost Eye Health

ఇవి బాగా తింటే మీ కళ్ళు హెల్దీగా ఉంటాయి

కళ్ళు బాగా కనిపించాలంటే కంటి ఆరోగ్యం బాగుండాలంటే చేపలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అలాగే గుడ్లు కూడా కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. గుడ్లలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది .ఇక మనం తీసుకునే ఆహారంలో నట్స్, సీడ్స్ కూడా మన కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

పప్పు ధాన్యాలతోనూ కంటి ఆరోగ్యం

మినుములు, శనగలు మరియు బీన్స్ జింక్‌ను అందిస్తాయి. ఇది కంటి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనది. జింక్ విటమిన్ Aని కాలేయం నుండి రెటినాకు రవాణా చేయడంలో సహాయపడుతుంది. పప్పు ధాన్యాలను తినడం రాత్రి దృష్టిని మెరుగుపరచడంలో, వయస్సుతో సంబంధిత మాక్యులార్ డిజెనరేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది.

ఆహారమే కాదు నీరు కూడా కంటి ఆరోగ్యానికి అవసరం

బాదంపప్పు, వాల్నట్స్, జీడిపప్పు వంటివి విటమిన్ ఈ తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, జింక్ లను అందిస్తాయి. ఇవి మన కంటి ఆరోగ్యం మెరుగుపడటానికి దోహదం చేస్తాయి. మనం తీసుకునే ఆహారంలో క్యారెట్ కూడా విటమిన్ ఏ తో నిండి ఉండటం వలన మన కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. అంతేకాదు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం, తగినంత నీరు తీసుకోవడం మన కంటి ఆరోగ్యానికి కీలకమైనవి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+