ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రెడీ..! ఇలా చెక్ చేస్తోండి-ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడంటే ?
ఏపీలో ఈ ఏడాది ఇంటర్ మొదటి, ద్వితీయ పరీక్షల్లో తప్పిన విద్యార్ధులు, బెటర్మెంట్ కోసం సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్ధులు ఫలితాల (AP Inter Supplementary Result 2026) కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిపై మరో అప్డేట్ వచ్చింది. అలాగే ఇంటర్ తర్వాత ఎంసెట్ (AP EAPCET 2026) పరీక్ష రాసిన అభ్యర్ధులు కూడా ఫలితాల కోసం ఎదురు
చూస్తున్నారు. ఈ ఫలితాలను ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల తర్వాత విడుదల చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇవాళ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేయబోతోంది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లోని లింక్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ రోల్ నంబర్‌తో లాగిన్ అవ్వడం ద్వారా మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఏపీ ఇంటర్మీడియట్ రీ-కౌంటింగ్ ,వెరిఫికేషన్ ఫలితాలు విడుదలయ్యాయి.కాబట్టి సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2026ను తెలుసుకోవడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ వివరాలతో లాగిన్ అవ్వాలి. అభ్యర్థులు తమ రోల్ నంబర్, అక్నాలెడ్జ్‌మెంట్/రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఉపయోగించి ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలను చూసేందుకు సంబంధించిన లింక్ bie.ap.gov.inలో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు అధికారిక ఫలితాల పోర్టల్ అయిన resultsbie.ap.gov.inలో కూడా తమ ఫలితాలను చూసుకోవచ్చు.

అలాగే ఈఏపీసెట్ (AP EAPCET Results 2026) ఫలితాలను రేపు విడుదల చేయబోతున్నారు. వీటిని కూడా అధికారిక వెబ్ సైట్ cets.apsche.ap.gov.in లోకి వెళ్లి తెలుసుకునేందుకు వీలు కల్పించారు. ఫలితాలు విడుదల కాగానే ఈ లింక్ ను ఓపెన్ చేసి వివరాలు ఎంటర్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. వాటిని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం కౌన్సెలింగ్ కు ఈ ప్రింటవుట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications