ABC జ్యూస్.. ఇప్పుడు టాప్ ట్రెండింగ్ జ్యూస్.. ఎందుకంటే
ఏ బి సి జ్యూస్.. ఇప్పుడు చాలామంది దీని యొక్క ప్రయోజనాలను తెలుసుకొని, దీన్ని తాగడానికి ఇష్టపడుతున్నారు. అసలు ఏమిటి ఏబిసి జ్యూస్? దేనితో ఈ జ్యూస్ ని తయారు చేస్తారు? ఇది జ్యూస్ ను తాగడం వల్ల కలిగే లాభాలు ఏమిటి? ఎందుకు ఇప్పుడు ఇది టాప్ ట్రెండింగ్ లో ఉంది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
ఏబీసీ జ్యూస్ లో ఫుల్ పోషకాలు
ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్‌ల మిశ్రమమే ABC జ్యూస్. ఈ జ్యూస్ మొత్తం ఆరోగ్యానికి మద్దతునిచ్చే ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంది. ఏబిసి జ్యూస్ లో విటమిన్లు A, B6, C మరియు K ఉంటాయి. ఇది పొటాషియం మరియు మాంగనీస్ వంటి ఖనిజాలను కూడా అందిస్తుంది. ఈ పోషకాలు రోగనిరోధక శక్తి మరియు చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి.

ఈ జ్యూస్ తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
ఏబిసి జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో కీలక భూమిక పోషిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించటానికి సహాయపడతాయి. ఏబిసి జ్యూస్ లో అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గట్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది. ఏబిసి జ్యూస్లో బీట్రూట్ యొక్క డీటాక్సిపైయింగ్ లక్షణాలు ఉండటం వల్ల క్రమం తప్పకుండా ఈ జ్యూస్ ను తీసుకుంటే కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.
గుండెకు ఆరోగ్యం మాత్రమే కాదు ఈ బెనిఫిట్స్ కూడా
మన శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా హృదయ ఆరోగ్యానికి మద్దతునిస్తుంది. బీట్రూట్ లోని నైట్రేట్లు రక్తనాళాలను వెడల్పు చేయడంలో సహాయం చేస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. ఈ జ్యూస్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి దోహదం చేస్తుంది. గుండె సంబంధిత ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. విటమిన్ ఏ కారణంగా ఈ జ్యూస్ తాగిన వారి కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నైట్ బ్లైండ్నెస్ నివారించడానికి, మంచి కనుదృష్టి కోసం ఈ జ్యూస్ ను తీసుకోవడం ఎంతో మంచిది.
బరువు తగ్గేందుకు మంచి ఛాయిస్
తక్కువ కేలరీలతో ఉండే ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్ సాధ్యమవుతుంది. అదనపు క్యాలరీలను చేర్చకుండా బరువు నిర్వహణకు ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది.ఎన్నో పోషక విలువలతో, ఆరోగ్య ప్రయోజనాలతో ఉన్న ఈ జ్యూస్ ను టైప్ 2 డయాబెటిస్ ,కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు ఉన్నవారు తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
అన్ని వయసుల వారికి ఏబీసి జ్యూస్
ఈ జ్యూస్ మన శరీరానికి శక్తిని సరఫరా చేయడమే కాకుండా ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది. అన్ని వయసుల వారికి ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఏ జ్యూస్ తీసుకున్నప్పటికీ పరిమిత మోతాదులోనే తీసుకోవడం మంచిది. అదేపనిగా ఏ జ్యూస్ తాగిన అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. కనుక ఆరోగ్యం వస్తుందని అదే పనిగా ఏ జ్యూస్ తాగొద్దు.












Click it and Unblock the Notifications