పాలల్లో పసుపు కలిపి తాగండి.. ఆశ్చర్యపోతారు

ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామాలు, యోగా చేస్తుంటాం. అయితే వీటన్నింటికన్నా ముఖ్యమైంది మంచి ఆహారం తీసుకోవడం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే చాలామంది పాలు తీసుకుంటుంటారు. మరికొందరు రాత్రివేళ ఒక గ్లాసు పాలు తాగి పడుకుంటారు. పాలల్లో అనేక పోషకాలున్నాయనే విషయం తెలిసిందే. అయితే ఈ పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని అది శరీరానికి చేసే మేలు చెప్పనలవి కాదు. పసుపు పాలు తాగడంవల్ల ఎటువంటి ఉపయోగాలున్నాయనేది తెలుసుకుందాం.

గుండెకు మేలు
పసుపు పాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు పసుపు పాలు తీసుకుంటుంటే ఆరోగ్యం మెరుగుపడటమేకాదు.. శరీరాన్ని కూడా దృఢంగా ఉంచుతుంది.

turmeric milk health

కీళ్ల నొప్పుల తగ్గుదల
ఈ పాలవల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా కీళ్లనొప్పులను తగ్గించే పలు అంశాలు పసుపులో ఉన్నాయి.

మెదడుకు బలం
ప్రతిరోజు క్రమం తప్పకుండా పసుపు పాలు తీసుకోవడంవల్ల మెదడు బలోపేతమవుతుంది. జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. పోషకాలు ఎక్కువగా ఉండే పసుపు పాలవల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

turmeric milk health

కాల్షియం, విటమిన్ డి
పసుపు పాల నుంచి కాల్షియం, విటమిన్ డి లభిస్తాయి. ఎముకలను దృఢంగా ఉంచడానికి ఇవి తోడ్పడతాయి. ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రాత్రి సమయంలో నిద్రించే ముందు దీన్ని తాగితే అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది.

జీర్ణవ్యవస్థ బలోపేతం
క్రమం తప్పకుండా పసుపు పాలను తీసుకుంటుంటే జీర్ణ వ్యవస్థ బలోపేతమవుతుంది. జీర్ణ వ్యవస్థను పటిష్టం చేసే గుణాలు పసుపులో సమృద్ధిగా ఉన్నాయి.

turmeric milk health

రోగనిరోధక శక్తి పెంపు
ప్రతిరోజు పసుపు పాలను తీసుకుంటుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనేక వ్యాధులతో పోరాడటానికి ఇది సహాయపడుతుంది. పసుపులో ఉండే యాంటీ వైరల్ గుణాలు పలు వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. వైరల్‌ దాడి నుంచి కాలేయాన్ని రక్షించడంతోపాటు ముక్కు దిబ్బడ, తలనొప్పితోపాటు ఇతర నొప్పులను పసుపుపాలు తగ్గిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+