డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయ తినవచ్చా..!?

పుచ్చకాయ. వేసవిలో పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయలో సుమారు 90% నీరు ఉంటుంది. ఇది వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. మధుమేహం ఉన్న వారు దీనిని తినడానికి భయపడుతుంటారు. పుచ్చకాయలోని తీపి వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతా యని ఆందోళన చెందుతారు. డయాబెటిస్ ఉన్న రోగులు పుచ్చకాయ తినవచ్చా అనే విషయంలో చాలా మందిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీనిపై వైద్య నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

పుచ్చకాయలోని గుణాలు శరీర వేడిని తగ్గించి, ఎండల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇది అలసటను తగ్గించి, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇందులో విటమిన్ A, సి, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా అలర్జీ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది. రోజుకు 100 నుండి 150 గ్రాముల పుచ్చకాయ ముక్కలను మించి తీసుకోకూడదు. పుచ్చకాయను జ్యూస్ చేస్తే అందులోని ఫైబర్ పోతుంది, దీనివల్ల షుగర్ లెవల్స్ వెంటనే పెరుగుతాయి. అందుకే ముక్కలుగానే తినాలి. పుచ్చకాయ ముక్కలను బాదం, వాల్‌నట్స్ లేదా ఇతర హెల్తీ ఫ్యాట్స్ ఉన్న ఆహారంతో కలిపి తీసుకుంటే చక్కెర గ్రహించే ప్రక్రియ నెమ్మదిస్తుంది. అలాగే తినే టైమ్‌ కూడా ముఖ్యమే. ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తీసుకోవడం మంచిది. రాత్రి పూట పండ్లు తినడం మధుమేహ బాధితులకు మంచిది కాదు.

watermelon-contains-natural-sugars-that-may-affect-your-blood-sugar-levels-depending-on-how-much-wat

పరిమితి మించకుండా తీసుకుంటేనే ప్రయోజనాలు

నిపుణుల ప్రకారం సరైన పరిమాణంలో తీసుకుంటే పుచ్చకాయ శరీరానికి హైడ్రేషన్ అందింస్తూ కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇస్తుంది. అయితే.. దీనిని ఎలా, ఎంత పరిమాణంలో తినాలి అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. పుచ్చకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నప్ప టికీ, గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు పుచ్చకాయను మితంగా (చిన్న కప్పు పరిమాణంలో) తినవచ్చు. అయితే పుచ్చకాయ రసం తాగడం మంచిది కాదు, ఎందుకంటే అది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచవచ్చు. మధుమేహం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని మితంగా తీసుకోవడం మంచిది. అవసరమైతే వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం. వేసవిలో పుచ్చకాయ తీసుకోవటం ద్వారా ఉన్న ప్రయోజనాలు అందిరికీ తెలిసినవే. అయితే... షుగరు.. ఇతర వ్యాధి గ్రస్తులు మాత్రం పరిమితంగా తీసుకోవటం ద్వారానే ప్రయోజనాలు అందుకుంటారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+