లివర్‌ను క్లీన్ చేసే ఆహారాలు..ఈ సూపర్ ఫుడ్ తో ఇక ఆస్పత్రికి దూరం.!!
లివర్. మన శరీర భాగాల్లో అత్యంత ప్రధానమైనది. ఇది మన ఆహారంలోని పోషకాలను శరీరం ఉపయోగించగలిగే పదార్థాలుగా మారుస్తుంది, ఈ పదార్ధాలను నిల్వ చేస్తుంది. అవసరమైపన సమయంలో వాటితో కణాలను సరఫరా చేస్తుంది. శరీరంలో టాక్సిన్స్ బయటకు పోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా లివర్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసే ఫుడ్స్ తినాలి. కొన్ని రకాల ఆహారాలు లివర్ డిటాక్సిఫికేషన్ ఫుడ్స్‌గా గుర్తింపు పొందాయి. వీటిని డైట్‌లో చేర్చుకుంటే లివర్ హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది.
లివర్ ను క్లీన్ చేసేందుకు నిపుణులు కొన్ని రకాల కూరగాయలు, ధాన్యాలు సూచిస్తున్నారు. వాటిల్లో బ్రోకలీ ఒకటి. ఇందులో సల్ఫర్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయం వ్యర్థాలను శరీరం నుండి సులభంగా తొలగించే ముఖ్యమైన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. కాలేయ శుద్ధి ప్రక్రియకు ఇది అత్యంత కీలకం. అదే విధంగా కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ, ఇది కాలేయానికి ఒక అద్భుతమైన ఔషధం లాంటిది. ఇది పిత్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కాలేయం పనిని సులభతరం చేస్తుంది. ఇక కాలే... క్యాబేజీ తరహాలో ఉండే కాలేకు పోషక విలువలు అధికంగా ఉండే ఆకుపచ్చని కూరగాయ. ఇందులో విటమిన్లు K, A, Cలకు శక్తివంతమైన మూలం. ఇది కాలేయ కణాలను బలోపేతం చేస్తుంది. ఫ్యాటీ లివర్ వంటి సమస్యలను నివారిస్తుంది.

అదే విధంగా ఇటీవల కాలంలో ప్యాక్డ్, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం బాగా పెరిగింది. వీటికి బదులుగా తృణధాన్యాలను ఎంపిక చేసుకోవాలి. కొర్రలు, రాగులు, సజ్జలు, క్వినోవాలో విటమిన్ బి, ఫాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్ డిటాక్షిఫికేషన్‌లో కీలకంగా పనిచేస్తాయి. పసుపు సుగంధ ద్రవ్యాల్లో పసుపు ఒకటి. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపులోని కర్కుమిన్ అనే సమ్మేళనం, కాలేయం పరిశుభ్రంగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబ్రోసిస్, నాన్-ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్, తీవ్రమైన క్రానిక్ లివర్ గాయాలు, సిర్రోసిస్ వంటి పరిస్థితుల నుంచి కాలేయాన్ని రక్షిస్తుంది. కాలేయాన్ని డిటాఫిక్సిఫికేషన్ చేస్తుంది. బ్రౌన్ రైస్‌లో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.












Click it and Unblock the Notifications