హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసును తిట్టా, కోపం పోయింది: రాములమ్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
మెదక్/ హైదరాబాద్: కాంగ్రెసుపై ఇన్నాళ్లు ఉన్న కోపమంతా పోయిందని తెలంగాణ రాములమ్మ, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అన్నారు. తాను ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉన్నానని ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను ఇన్ని రోజులు కాంగ్రెసు పార్టీనే తిట్టాను తప్ప వ్యక్తులను తిట్టలేదని స్పష్టం చేశారు.

ఎన్ని దుష్టశక్తులు ప్రయత్నించినా తెలంగాణ ఇక ఆగదని ఆమె అన్నారు. సమైక్యవాదం వల్లనే తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి విజయశాంతి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ఆమె కాంగ్రెసు పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆమె మెదక్ లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రాష్ట్రపతి పాలన పెట్టి విభజన

విభజన నిర్ణయం అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అంటూ తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఢిల్లీ పెద్దలను కోరామని, వారు సుముఖంగా స్పందించారని పాల్వాయి చెప్పారు.

రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, శాంతిభద్రతలు అదుపులో లేవని ఆయన అన్నారు. ఈ మేరకు ఢిల్లీ పెద్దలకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. పంజాబ్, హర్యానా విభజన కూడా రాష్ట్రపతి పాలన సమయంలోనే జరిగిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో విభజనకు తల ఊపి, రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్సించారు.

English summary
Medak MP Vijayashanthi said that she criticised only Congress party not made personal allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X