ఆ స్టార్ హీరోకు మహిళా ఎంపీ ప్రపోజ్..?
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లతో సెల్ఫీలు తీసుకోవాలని, కొంత సమయం గడపాలని తహతహలాడుతుంటారు. మరి కొంతమంది అయితే వాళ్లతో ప్రేమలో పడిపోతారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మహువా మోయిత్రా గురించి అందరికీ తెలిసిందే. ఆమె తన హాట్ కామెంట్స్ తో ఎప్పుడూ వైరల్ గా మారుతూ ఉంటారు. అయితే తాజాగా మరోసారి కీలక కామెంట్స్ చేశారు. బాలీవుడ్ కు చెందిన స్టార్ యాక్టర్ ను తాను ఎంతగానే ప్రేమించినట్లు చెప్పుకొచ్చారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా.. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో హిందీ సినిమాలపై తనకున్న ప్రేమను చాటి చెప్పారు. అలాగే బాలీవుడ్ లో ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి అంటే ఎంత ఇష్టమో చెప్పుకొచ్చారు. "మున్నాభాయ్ సిరీస్ చాలా ఇష్టం. అవి మళ్లీ మళ్లీ చూస్తాను. విక్కీ డానర్ మూవీ ఇష్టం. ఇంటెన్స్ పాత్రలు చేసే పంకజ్ త్రిపాఠి అంటే చాలా ఇష్టం. ఆయన కోసం మీర్జాపుర్ సిరీస్, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపర్ మొత్తం చూశాను. ఆయన అలాంటి పాత్రలు చేయడంలో దిట్ట అని చెప్పుకొచ్చారు.

ఓ సారి పంకజ్ త్రిపాఠి ని కలుద్దామని అనుకున్నారట. ఈ మేరకు మహువా మోయిత్రా.. ఓ లెటర్ రాశారు. కాఫీకి రమ్మని అడిగారు. మిమ్మల్ని కలుసుకోవడం ఇష్టం. అని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే పంకజ్ త్రిపాఠి ఎవరితో కాఫీ కోసం కలవరని తెలిసింది. ఆ తర్వాత మహువా మోయిత్రా బీజేపీ ఎంపీ అయ్యాక కూడా పంకజ్ త్రిపాఠిను కలిసేందుకు యత్నించినట్లు ఆమె తెలిపారు. నటుడు రవి కిషన్ సాయంతో ఆయన్ను కలిసే ప్రయత్నం చేశారట. అయితే చివరగా పంకజ్ ను ఫోన్ లో మాట్లాడిపించారట రవి కిషన్. ఆ ఉత్సాహంలో ఆమె మాట్లాడుకున్న విషయాలు మర్చి పోయినట్లు తెలిపారు మహువా మోయిత్రా.
ఇక పంకజ్ త్రిపాఠి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన మెట్రో ఇన్ దినో అనే సినిమాలో నటించారు. క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 లోనూ కనిపించారు.












Click it and Unblock the Notifications