బ్రిక్స్ సదస్సు : రష్యాతో భారత్ కీలక ఒప్పందాలు
గోవా : గోవా వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో పుతిన్, మోడీ మధ్య కీలక సమావేశం జరిగింది. వీరిద్దరి భేటిలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా పుతిన్ సహకారంతో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించిన మోడీ.. రక్షణ, నిర్మాణం, ఆర్థిక, వ్యాపారం రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగినట్లుగా తెలిపారు.
స్నేహపూర్వక వాతావరణంలో ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు ఈ సందర్బంగా మోడీ పేర్కొన్నారు. న్యూక్లియర్ అంశాలకు సంబంధించి పలు విషయాల్లో ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిరినట్లుగా చెప్పారు. ఎస్400 మిసైల్ వ్యవస్థ కోసం రష్యాతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా తెలియజేశారు.

ఇకపోతే తాజా ఒప్పందాల్లో భాగంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరాల మధ్య హైస్పీడ్ రైలు నడిపేందుకు భారత్, రష్యాల మధ్య ఒప్పందం కుదిరడం విశేషం. రష్యా అధినేత పుతిన్, భారత ప్రధాని మోడీ సమక్షంలో దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలను ఇరువురు ఇచ్చి పుచ్చుకున్నారు.
రష్యా అధ్యక్షుడితో సమావేశం అనంతరం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమర్, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు జాకోబ్ జుమాతో వరుసగా భేటీ అవనున్నారు మోడీ. ఎన్ఎస్జీ, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, పాక్-చైనా ఆర్థిక కారిడార్ వంటి అంశాలపై చైనా అధ్యక్షుడితో మోడీ చర్చించే అవకాశం ఉంది.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications