• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Jokes: ఈ భార్యా భర్తల మధ్య పేలిన టాప్‌ జోక్స్‌ చదివి కాసేపు హాయిగా నవ్వుకుందాం..!

|
Google Oneindia TeluguNews

నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. నవ్వు ఒక యోగం,నవ్వడం ఒక బోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని సినీ దర్శకులు జంధ్యాల చెబుతూ ఉండేవారు. అందుకే వన్‌ఇండియా పాఠకుల కోసం జోక్స్‌ను అందిస్తున్నాం. ప్రతిరోజు జోక్స్ ‌ను చదివి కాసేపు నవ్వుకుని ఆరోగ్యంను పదిలంగా ఉంచుకోండి. ఇవ్వాల కొన్ని జోక్స్.

భార్య: ఏం చేస్తున్నారండీ

భర్త: దోమల్ని చంపుతున్నానే..

భార్య : ఇప్పటి వరకు ఎన్ని చంపారండీ..

భర్త : మొత్తం ఐదు దోమలు చంపానే.. అందులో రెండు ఆడవి.. మూడు మగ దోమలు

భార్య : అవి ఆడవి, మగదోమలు అని మీకెలా తెలుసండీ..

భర్త : ఆ... ఏంలేదు. 2 అద్దం దగ్గర మరో మూడు బీర్ బాటిల్స్ దగ్గర ఉన్నాయి..

********************

ఓ లోదుస్తుల దుకాణంలోకి ఓ ప్రముఖ హీరోయిన్ వెళ్లింది. అక్కడ తనకు కావాల్సిన లోదుస్తులను సెలెక్ట్ చేసుకుంది. ఇక షాపు అతనితో ఇలా అంటోంది

హీరోయిన్: బాబూ ట్రయల్ రూం ఎక్కడ..?

షాపు అతను: ఎందుకు మేడం..?

హీరోయిన్ : ఒకసారి ఈ లోదుస్తులను ట్రయల్ వేయాలి

షాపు అతను : ఎందుకు మేడం.. ఇక్కడే ట్రయల్ వేసి చూస్కోండి. అభిమానుల ముందు దాచేదేముంది. నేను మీ ఫ్యాన్‌ని..

**********

భార్య: మన పొరిగింట్లోకి కొత్తగా వచ్చిన భార్య భర్తలు చాలా అన్యూన్యంగా ఉంటారు. ఎంతలా అంటే ఆ భర్త తన భార్యకు ప్రతి రోజు ముద్దు ఇచ్చి వెళతారు. మీరెందుకు అలా చేయరు..?

భర్త : నేను అతని భార్యను ముద్దు పెడితే ఏం బాగుంటుంది చెప్పు. ముందే ఆమె ఎవరో నాకు తెలియరు.

అంతే ఈ ఒక్క సమాధానంతో భార్య గొంతు మూగబోయింది.

***************

Laugh for a while: Top telugu jokes between wife and husband, Here is the list

మీ భార్య ఎప్పుడైనా తన తప్పులను లేదా పొరపాట్లను కరెక్ట్ చేయాలని చెబితే ఓ నవ్వు నవ్వేసి ఒప్పుకోండి. అంతే తప్పా చెప్పింది కదా అని ఆమె తప్పులను సరిజేసే ప్రయత్నం చేశారో మీరు ఆమె చేతికి చిక్కినట్లే..!

************
భార్య భర్తల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది

భర్త: నేను భర్త అనే పోస్టుకు రాజీనామా చేస్తున్నాను

భార్య: సరే.. నాకు మరొకరు భర్తగా వచ్చే వరకు మీరు భర్తగా ఉండి తీరాలి.

**********
భార్య : నాతో 10 సంవత్సరాల ప్రయాణం అంటే ఏంటి..?

భర్త : ఒక్క క్షణం

భార్య : మరి నాకు 1000 డాలర్లు ఇస్తున్నారంటే..?
భర్త : అది ఒక నాణెంతో సమానం

భార్య : అయితే ఆ నాణెం నాకు ఇచ్చేయండి

భర్త : అలాగే ఇస్తాను కానీ ఒక్క క్షణం ఆగు..

***************
కొత్తగా ఓ జంటకు పెళ్లయ్యింది. భర్త తొలినాళ్లలో ఆయన మొబైల్‌లో భార్య నెంబరు "MY LIFE " అని సేవ్ చేసుకున్నాడు

ఒక ఏడాది గడిచాక భార్య మొబైల్ నెంబరును "MY Wife" అని సేవ్ చేసుకున్నాడు

రెండేళ్ల తర్వాత "Home" అని సేవ్ చేసుకున్నాడు

ఐదేళ్ల అనంతరం "Hitler"అని నెంబర్ సేవ్ చేసుకున్నాడు

10ఏళ్ల తర్వాత "wrong number"అని సేవ్ చేసుకున్నాడు.

******************

భార్య భర్తల మధ్య ప్రేమ ఎంత ముదిరిందంటే...

భార్య : భోజనం అయ్యిందా...

భర్త : నీ భోజనం అయ్యిందా..

భార్య : ముందు నేను అడిగాను..

భర్త : లేదు నేను అడుగుతున్నాను కదా చెప్పు

భార్య : నేనేమి అడిగితే అదే అడుగుతున్నావా..?

భర్త: లేదు నేనేమి అడగాలనుకుంటున్నానో నువ్వే అది అడుగుతున్నావ్..

భార్య : సరేలే.. షాపింగ్‌కు వెళదాం పదా..

భర్త: నా భోజనం అయ్యింది.

*************

English summary
Laughing is good for health. Be it for any joke or any laughing excercise. Here are few jokes for the readers to laugh for a while.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X