అప్పుడే ఎందుకు అరెస్టు చేయలేదు....
పోలీస్ స్టేషన్ ప్రెస్ కమిటీ మెంబర్ అయిన సుబ్బారావు ఓ రోజు ప్రెస్ కమిటీ మీటింగ్ కు స్టేషన్ కి వెళ్లాడు. అక్కడ గోడకున్న నోటీస్ బోర్డులో పదిమంది నేరస్దుల ఫోటోలు చూసి అడిగాడు.
"ఎవరు వీరు?"
"మన ఏరియాలో మర్డర్స్, మానభంగాలు, దోపీడిలు చేసే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ "...ఓపిగ్గా చెప్పాడు ఎస్సై.
సుబ్బారావు కొద్ది సేపు ఆలోచించి.. సీరియస్ గా ఫేస్ పెట్టి అడిగాడు..
"మీరు వాళ్లని ఫోటోలు తీసేటప్పుడే ఎందుకు అరెస్టు చేయలేదు"
---------------
ఇందిరా గాంధీ టైమ్ లో నేను బాగా తినగలిగే వాడిని తెలుసా...
అప్పుడు ధరలు బాగా తక్కువగా... జీతం చాలా ఎక్కువగా ఉండి ఉంటుంది అన్నాడు రెండో వ్యక్తి.
అదేం కాదు...అప్పుడు నాకు నోటి నిండా పళ్ళు ఉండేవి అన్నాడు ఆ ముసలాయన.
ఇప్పుడు చట్టానికి పళ్లు పెరిగినట్టున్నాయే అన్నాడు రెండో వ్యక్తి












Click it and Unblock the Notifications