50ఏళ్ళ తర్వాత శని రాహువుతో శుభయోగం: వీరికి ఈ ఏడాదంతా సంపదవర్షం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహువును చెడు చేసే గ్రహంగా చెప్తారు. కానీ రాహువు కొన్ని సమయాల్లో కొన్ని రాశుల వారికి శుభాలను కూడా ఇస్తాడు. నీడ గ్రహంగా చెప్పబడే రాహువు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరం మీనరాశిలో ప్రవేశించిన రాహువు 2025 లో మళ్లీ రాశి మారుతాడు. అయితే రాహువు నక్షత్రాన్ని జులై 8వ తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రంలోనికి రవాణా అయ్యాడు.
శని రాహువుల కారణంగా శుభయోగం
ఈ సంవత్సరం చివరివరకు రాహువు ఇదే నక్షత్రంలో తిరోగమన దిశలో సంచరిస్తూ ప్రయాణం చేస్తాడు. 50 ఏళ్ళ తర్వాత రాహువు శని నక్షత్రంలో అరుదైన శుభ యోగాన్నిఏర్పరుస్తున్నాడు. ఇక ఈ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు. శనికి రాహువు కి మధ్య మంచి సఖ్యత ఉన్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి వీరిరువురి కారణంగా జాతకంలో శుభయోగం ఏర్పడుతుంది. వారి పైన రాహువు యొక్క కటాక్షం ఉంటుంది.

వృషభ రాశి
ఉత్తరభాద్ర నక్షత్రం లోకి రాహువు నక్షత్ర మార్పు వల్ల వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా లాభదాయకంగా ఉంటుంది. కొద్దిగా ఖర్చులు పెరిగినప్పటికీ వీరు ఆర్థికంగా బలోపేతంగా ఉంటారు. ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభిస్తే కూడా శుభం జరుగుతుంది.ఈ ఏడాది చివరి వరకు వృషభ రాశి వారికి ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వృషభరాశి జాతకులవైవాహిక జీవితం కూడా సంతోషదాయకంగా ఉంటుంది.
మిధునరాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాహువు మార్పు వల్ల గతంలో ఆగిపోయిన పనులను ఇప్పుడు మిధున రాశి వారు పూర్తి చేయగలుగుతారు. రాహువు నక్షత్ర మార్పు వల్ల మిధున రాశి వారికి కలిసొస్తుంది. కెరీర్లో ప్రమోషన్లు పొందడానికి చాలా ముఖ్యమైన పనులను చేయవలసి ఉంటుంది. కొన్ని శుభవార్తలను కూడా వింటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది . ఈ సమయంలో మీరు బాగా పని చేయాల్సి ఉంటుంది.కానీ మంచి ఫలితం వస్తుంది.
మకర రాశి
మకర రాశి వారికి రాహువు నక్షత్ర మార్పు బోలెడు లాభాలను ఇస్తుంది. ఈ సంవత్సరం చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. దాంపత్య జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. వ్యాపారంగంలో ఉన్నవారు మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఈ సమయంలో సుఖంగా రాజభోగాలతో తులతూగుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications