వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరసింహ వ్రతం: స్వామి తనే చెప్పిన విధం

By Pratap
|
Google Oneindia TeluguNews

సృతిదర్పణము, గదాధరపద్దతి, పురుషార్థ చింతామణి, చతుర్వర్గ చింతామణి మొదలైన గ్రంథాలన్నీ వైశాఖ శుక్ల చతుర్ధశిని నరసింహ చతుర్దశి వ్రతదినంగా పేర్కొంటున్నాయి. కాగా ఈనాడే నృసింహ జయంతి అని కంఠోక్తిగా చెప్పవచ్చు.

విష్ణుమూర్తి పది అవతారాలలో నరసింహావతారము నాలుగోది.

మంత్రము -

ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుంనమామ్యహం",
అనే మంత్రంతో ఈదినమున నరసింహమూర్తిని పూజిస్తే శత్రుజయం కలుగుతుంది.

విధానము -

నృసింహ చతుర్దశి వ్రతాన్ని. నృసింహపురాణం, స్కాంద పురాణాలు వివరిస్తూ వున్నాయి. వైశాఖశుక్ల చతుర్ధశినాడు ఈ వ్రతం చేయాలి. "వైశాఖ శుక్ల చతుర్దశి నాటి రాత్రి నేను పుట్టితిని. కాబట్టి ఆనాడే వ్రతము చేయుటకు తగిన రోజు' అని నృసింహస్వామి వచించినట్లు కలదు.

Astrologer explained the process of Narasimha Swami Vratam importance.

"వైశాఖ శుక్ల చతుర్దశి సోమవార స్వాతీనక్షత్రం ప్రదోషకాలంలో నృసింహస్వామి అవతరించాడు. స్వాతి నక్షత్రం శనివారం సిద్దియోగంలోవణిజమను కరణంలో ఈ వ్రతం చేయడం పరమశ్రేష్టము. కాని ఈ విధమైన యోగం కలిసిరావడం చాలా కష్టము. ఆయోగం కుదిరిన నాడు పుట్టిన రోజు ఈ వ్రతం చేయతగింది.

నావ్రతం చేయడానికి అన్ని వర్గాలవారికి అధికారముంది." అని నృసింహస్వామి వచించినట్ల స్కాందపురాణంలో కలదు. ఈ వ్రతం చేయడానికి అన్ని వర్గాల వారికి అధికారం ఉన్నట్లు చెప్పబడ్డా ఇది ఇప్పడు వైష్ణవులే ఎక్కువగా చేస్తున్నారు. వ్రతవిధి, వైశాఖశుక్ల చతుర్ధశినాడు ఈ వ్రతం చేయాలి.

ఆ రోజున ఎట్టి పాపంకాని చేయకూడదు. మధ్యాహ్నం స్నానం చేయాలి. గోమయశుద్దమైన యింట అష్టదళపద్మం పెట్టికలశ స్థాపన చేయాలి. ఆ కలశం మీద " వెదురు గొట్టం వుంచాలి. అక్కడ లక్ష్మీనారాయణుల విగ్రహాలు వుంచాలి. శాస్రాచారప్రకారం వ్రతం జరపాలి. ఆ కాలంలో దొరికే పూవులతో పూజచేయాలి. రాత్రి జాగరణ చేసి పురాణకాల క్షేపం చేయాలి. మరునాటి ఉదయాన్ని తిరిగి పూజ చేయాలి.

తరువాత యధాశక్తి నృసింహప్రతిమాదానాలు, భోజనాలు. మూల్లాన్లో నృసింహ జయంతి గొప్పగా సాగిస్తారు. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు ఆ వూరివాడట. ఆ సందర్భ చిహ్నాలు ఇప్పటికి కూడా అక్కడ వున్నాయి. దక్షిణ దేశంలో నృసింహజయంతిపర్వ సందర్భంలో దీపోత్సవాలు జరుగుతాయి.

English summary
Astrologer explained the process of Narasimha Swami Vratam importance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X