వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజేతా? తీసికట్టా?: గరుడ పంచమి విశిష్టత

శ్రావణ శుద్ద పంచమిని ఆంధ్రదేశంలోని కృష్ణా, గోదావరినదీ మండలాల్లోని సాగర ప్రాంతీయులు గరుడ పంచమి పర్వంగా వ్యవహరిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శ్రావణ శుద్ద పంచమిని ఆంధ్రదేశంలోని కృష్ణా, గోదావరినదీ మండలాల్లోని సాగర ప్రాంతీయులు గరుడ పంచమి పర్వంగా వ్యవహరిస్తున్నారు.

పురాణ గాథలు విచారిస్తే నాగులకి, గరుడిడికి విరోధం ఉండడం తెలిసి వస్తుంది. ఆ గాథల్లో గరుడుడే విజేతగా ఉంటుంటాడు. కాని దీనికి భిన్నంగా భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో గరుడుడే తీసికట్టు అయినట్లు గాథలు ఉన్నాయి.

astrologer tells about garuda panchami

గరుత్మంతుడికి, నాగరాజైన తక్షకుడికి ఒకసారి యుద్ధం జరిగింది. యుద్ధంలో గరుత్మంతుడు ఓడిపోయాడు. నాగవిగ్రహం కల యంత్రపు బిళ్లను మెడలో వేళ్లాడ కట్టుకుని ఉండే షరతు మిూద ఇద్దరికీ రాజీ అయింది. ఇది వంగదేశంలో వాడుకలో ఉన్న పురాణకథ. సర్పరాజుకు గరుత్మండు నమస్కరిస్తూ ఉన్నట్లు శిల్పఖండాలు కూడా నేపాళము మున్నగు తావుల్లో ఉన్నాయి.

వ్రతరత్నాకరంలో గరుడపంచమి ప్రస్తావన ఉంది. గోదావరి మండల ప్రాంతపు పంచాంగాలలో మాత్రము ఒకటి రెండింటియందు గరుడ పంచమి పేర్కొనబడుతుంది. విష్ణువుకు గరుడుడు వాహనం. విష్ణు ఆలయాల్లో ఆ వాహనాలు ఉండడం వాని మీద ఊరేగింపులు సాగడం ఉంటూ ఉంటుంది. గరుడిడికి ప్రత్యేకంగా ఆలయాలు ఉండడం అరుదు.

గరుడిడికి వైనతేయుడని మరోపేరు ఉంది. గోదావరి ఏడుపాయల్లో ఒకదానికి వైనతేయ అని పేరు. అది వసిష్ఠ గోదావరి నుండి గన్నవరం అనే ఊరువద్ద నుండి విడిపోతుంది. ఆ గన్నవరం వద్ద గరుడేశ్వరస్వామికి ఒక ఆలయం ఉంది. గన్నవరాన గరుడేశ్వర స్వామిని గరుడుడు ప్రతిష్టించాడని ప్రతీతి ఉంది. వైనతేయ పాయను తీసుకువెళ్లింది వైనతేయుడైన గరుడుడు లేక వైనతేయ బుషి అంటారు.

అయితే నాగపంచమి తిథికే గరుడపంచమి అనే పేరు కూడ ప్రవర్తితం కావడానికి ఏమిటి కారణం? ఈ జిజ్ఞాసకు సమాధానం బ్రహ్మాండపురాణంలో ఉంది. శ్రావణ శుక్ల పంచమినాడు గరుడుడు అమృతాపహారణం చేశాడు. అందుచేత దీనికి గరుడ పంచమి అనే పేరు వచ్చింది.

గరుడుడు అమృతం తెచ్చి సవతితల్లికి ఇచ్చి తన తల్లి దాస్యం బాపాడు. సవతి తల్లి పిల్లలైన నాగులు ఆ అమృతాన్ని తాగడానికి సిద్దపడులోగా దేవతలు దానిని తిరిగి కొనిపోయారు. గరుడుడు అమృతం తెచ్చిన రోజు కాబట్టి దీనికి గరుడపంచమి అనే పేరు వచ్చింది. అంతేకాని ఈనాటి పూజా విధానంలో గరుడిడి ప్రమేయం ఏమిన్ని లేదు. వ్రత రత్నాకరంలో గరుడపంచమివ్రత విషయం ఉంది. కాని అందలి పూజాదికాలలో నాగసంబంధమే కాని గరుడ సంబంధమేమిూ కానరాదు.
గరుడపంచమి వ్రత విధాన మిలా ఉంది.

ఈ వ్రతం శ్రావణ శుక్లపంచమిూ దినాన సోదరులు కల పది సంవత్సరాలు చేయతగింది. ఆనాడు ఆ స్త్రీ స్నానం చేసి చతురశ్రమైన మంటపం ఏర్పరచాలి. ఫలకుసుమాదులచే దానిని అలంకరించాలి. పంచవర్ణపు ముగ్గులు పెట్టాలి. నడుమ బియ్యం పోయాలి. సర్ప ప్రతిమను ఆ బియ్యం మిూద ఉంచాలి. దాని పడగ మధ్యలో గౌరీబింబాన్ని స్థాపించాలి. ఆ గౌరిని, పదిమళ్లు గల దోరమును షోడశోపచారాలతో పూజించాలి. ఆ తోరాన్ని తాను ధరించాలి.

ఇది పూజా విధానం, వ్రతం పేరేమో గరుడ పంచమియా వ్రతమని ఆ వ్రతంలో పూజ అంతా సర్పప్రతిమకు, గరుడుడికి, సర్పాలకి సహజవిరోధం, అగుచో గరుడిడి పేర పరగే పర్వం నాడు నాగపూజ ఎట్లు ఏర్పడింది? గరుడుడు అమృతం తెచ్చి ఇచ్చాడు. అతడి పని వల్ల దాస్యం తీరింది. అమృతం మాత్రం నాగుల అనుభవానికి అందలేదు. అందుచేత నాగులు అతపులు కావడం సహజం. అసంతృప్తులైన నాగులకు తృప్తి కలిగించడం కోసం పూజలు సల్చడం వారి విరోధితో జతపడిన ఈ ప్రత్యేకింపబడింది.

English summary
Astrologer described about garuda panchami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X