మరణానంతరం జీవునిస్థితి ఎలావుంటుంది?
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.
హైదరాబాద్: మరణం జీవులను భౌతిక జగత్తు నుండి విడదీస్తుంది. మరణం అంటే ఏమి ?యోగశాస్త్రరీత్యా సూక్ష్మశరీరం స్థూల శరీరాన్ని వదలిపోవడమే .
అంతేకాక జీవుల ఆయుర్దాయం శ్వాసలలో పేర్కొంటుంది యోగశాస్త్రం .శ్వాసల పరిమితి ముగిసిన వెంటనే సూక్ష్మశరీరం స్థూలశరీరాన్ని వదిలిపోతుంది.అందుకే తుదిశ్వాస వదిలాడు అంటుంటారు .
యోగులు వందల సంవత్సరాలు జీవిస్తున్నారంటే కారణం శ్వాసలను వారు నియంత్రించ గల్గడమే .శ్వాసల మధ్య కాల వ్యవధి పెరిగే కొద్దీ జీవితకాలం పెరుగుతుంది .ప్రాణాయామంలో సిద్ధి పొందినవారు గంటలకొద్దీ ,రోజుల కొద్దీ శ్వాసను స్తంభింపచేయగలరు. దీనిపై ఎన్నో పరిశోధనలు జరిపి ఋజువు చేసినారు.
ఒక యోగి ఆత్మకథ వంటి గ్రంథాలలో ఎన్నో ఉదంతాలు కనిపిస్తాయి .
అంతెందుకు? మన నిత్యానుభవంలో ఎక్కువ ఆందోళన భయం శ్రమ వంటి సందర్భాలలో మన ఉచ్చవాస నిశ్శ్వాసలలో ( ప్రశాంతంగా ఉన్నప్పటి కంటే) వేగం పెరుగుతుంది .అదితీవ్రమైతే మరణం కూడా సంభవించ వచ్చు .ఇదంతా యోగశాస్త్రరీత్యా పంచకోశాలలో ప్రాణమయకోశంలో జరిగే ప్రక్రియ.
భగవద్గీతలో 15వ అధ్యాయంలో మరణానంతరం జీవచైతన్యం సూక్ష్మ శరీరం పొందే మార్పులు లోకాంతర ప్రయాణం వంటి విషయాలు వివరించారు. శ్లో 7-11 దాని వివరణ :"నా అంశలే జీవులుగా ఉన్నారు .మరణ సమయంలో ఆ జీవి చైతన్యం మనస్సుతో కూడా ఇంద్రియాలను ఆకర్షించుకుంటుంది.

జీవుడు మనస్సుతో సహా ఇంద్రియాలను వెంటదీసుకుని ఒక స్థూల శరీరాన్ని వదాలి మరొక స్థూలశరీరాన్ని గ్రహిస్తుంది .స్థూల శరీరంలో ఉన్నప్పుడు ఇంద్రియాల ద్వారా విషయ భోగాలను అనుభవిస్తున్నాడు .మూఢులు జీవ చైతన్యాన్ని ఏ దశలో కూడా చూడలేరు .జ్ఞానదృష్టి కలవారు మాత్రం శాస్త్ర ప్రమాణంతో వివేకించి చూడగలరు .
సమాహితచిత్తులైన యోగులు ప్రయత్నంతో జీవ చైతన్యాన్ని సూక్ష్మ శరీరాన్ని
చూడగలరు,చూస్తున్నారు ."ఆధ్యాత్మ దర్శన అభ్యాస యోగం దీన్నే భోదిస్తుంది.సూక్ష్మ శరీర దర్శన అనుభవం పొందిన యోగికి మరణ భయం లేదు . మరో జన్మకూడా ఉత్తమ మానవ జన్మే సిద్ధిస్తుందని భగవానుని ప్రతిజ్ఞ .
కఠో పనిషత్ లో యమధర్మరాజు ఈ విధంగా చెప్తున్నాడు ."ఇహ లోక భోగాలతో అజ్ఞానుడైనవానికి పరలోకమార్గం కనిపించదు .ఇదితప్ప మరో లోకమే లేదనుకుంటూ మల్లి మల్లి నా బారిన పడుతుంటాడు .పుట్టగతులుండవు .రెంటికీ చెడినవాడు . అనే మాటలు ఈ విషయాన్ని తెలుపుతాయి .
మరణం తర్వాత జీవులకు రెండు మార్గాలున్నాయి .ఆ రెండూ పొందనివాడు రెంటికీ చెడినవాడు .ఆ రెండు మార్గాలను గీత వివరించింది .( 8వ అధ్యాయం 26 శ్లో )
జగత్తు లోని జీవులకు 1శుక్ల 2 కృష్ణ అనే రెండు మార్గలున్నాయి .జ్ఞానులు ,పరమ వైరాగ్య సంపన్నులు నిర్గుణోపాసకులు శుక్లమార్గం ద్వార బ్రహ్మలోకం చేరుతారు,వారికీ పునర్జన్మ లేదు.దీన్నే దేవయానం ,అర్చిరాది మార్గం అని అంటారు .
పుణ్య కర్మలు చేసినవారు తపస్సు,యాగాలు చేసిన సగుణోపాసకులు కృష్ణ మార్గం ద్వారా స్వర్గాది పుణ్యలోకాలుచేరి ,కర్మానుభవం పొంది తిరిగి జన్మనెత్తుతారు .దీన్ని పితృయానం ,ధూమది మార్గం అని అంటారు .వీరందరి కన్నా గొప్ప పుణ్యశీలి అభ్యాసయోగి .
పుణ్యలోకాల్లో ఎక్కువ కాలం గడిపి మళ్ళి ఉత్తమ మానవజన్మనే పొందుతాడు.దానికి కారణం అతడు చేసిన పరమోత్తమ అభ్యాస యోగమే .












Click it and Unblock the Notifications