ఎల్లుండి శ్రావణ పౌర్ణమి నుంచి ఈ రాశులకు పెరుగుతున్న సంపద
ఈనెల 19వ తేదీన శ్రావణ పౌర్ణమి వచ్చింది. అదేరోజు రక్షాబంధన్ జరుపుకుంటారు. దీన్నే రాఖీ పౌర్ణమి అంటారు. ఆరోజు చంద్రుడు శని రాశిలో సంచరిస్తాడు. రెండున్నరోజులకు ఒకసారి ఆయన రాశిని మార్చుకుంటుంటాడు. అంతకుముందు రోజు శనిదేవుడు తన నక్షత్రాన్ని మార్చుకొని పూర్వాభాద్రలోకి ప్రవేశిస్తాడు.
శ్రావణ పౌర్ణమికి జరిగే ఈ శుభ పరిణామాలవల్ల కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశిస్తుంది. రవి యోగం, సిద్ధి యోగం, సౌభాగ్య యోగం, శోభన యోగం, శ్రవణా నక్షత్రాల్లో రక్షాబంధన్ జరుపుకోవడం జరుగుతుంది. పరమేశ్వరుడి దయతోపాటు శనిదేవుడి ఆశీస్సులు అందుకునేవారి వివరాలను తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వీరికి మంచి లాభాలు 19వ తేదీ తర్వాత అందుతాయి. అదనపు ఆదాయ మార్గాలు కూడా తోడవుతాయి. ఇప్పటివరకు వేధిస్తున్న కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. శనిదేవుడి అనుగ్రహం వల్ల ఆర్థికంగా మంచిరోజులు వస్తాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మంచి ఫలితాలు కలగడంతోపాటు సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించని ఆనందాన్ని అనుభవిస్తారు.
కుంభ రాశి
ఈ రాశివారి సంపద పెరుగుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను ఈ సమయంలో పూర్తిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. రక్షాబంధన్ అనేది వీరికి వరం లాంటిదని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
మేష రాశి
శనిదేవుడు అనుగ్రహించడంవల్ల పనుల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలుండటంతోపాటు ఇతర ప్రాంతాలకు విస్తరించి ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కెరీర్ పరంగా మంచిస్థాయికి చేరుకుంటాయి. కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తారు.












Click it and Unblock the Notifications