vastu tips: పీడకలలు నిద్ర పోనివ్వటం లేదా? అయితే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి!!
పగలంతా ఆరోగ్యంగా ఉండి, కొంతమంది రాత్రివేళల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. సరిగ్గా నిద్ర కూడా పోలేరు. రాత్రి అయితే చాలామందిలో అర్ధం కాని విపరీతమైన భయం, ఆందోళన వారిని నిద్రపోనివ్వదు. ఒకవేళ నిద్ర పోయినా అర్ధరాత్రి మెలకువ రావడం, చెడు కలలు రావడం వంటి అనేక సంభవిస్తాయి. ఇక అటువంటి వారు రాత్రివేళల్లో నిద్ర పోయే ముందు చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే నిద్ర భంగాలనుండి బయటపడవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

పీడ కలలు రాకుండా జాగ్రత్తలు
ముఖ్యంగా నిద్రకుపక్రమించే ముందు ఏ దిశలో తల పెట్టి పడుకుంటున్నాము అనేది చూసుకోవడం మంచిదని చెబుతున్నారు. పొరపాటున కూడా ఉత్తరం దిక్కున తలపెట్టి కూడదని చెబుతున్నారు. మరీ పీడ కలలతో ప్రతిరోజు ఇబ్బంది పడుతున్న అలాగే నిద్రకుపక్రమించే ముందు గదిలో నాలుగు మూలలలో కాస్త రాతి ఉప్పును పోస్తే గదిలో ఉండే నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుంది అని చెబుతున్నారు. తద్వారా ప్రశాంతంగా నిద్రపోవడానికి వీలుంటుందని సూచిస్తున్నారు.

ప్రతికూల ప్రభావం నుండి రిలీఫ్ కోసం చెయ్యండిలా
అంతేకాదు ఒక చెంబుడు నీటిని తీసుకొని, మంచం పక్కన మూలన పెట్టి తెల్లవారుజామున ఆ నీటిని పారిపోయారని సూచిస్తున్నారు. గదిలో నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే నీరు తనలోకి తీసుకుంటుందని తద్వారా కాస్త ప్రతికూల ప్రభావం నుండి ఉపశమనం ఉంటుందని చెబుతున్నారు. ఇక నిద్రకుపక్రమించే ముందు కాసేపు ప్రశాంతంగా భగవంతుని ధ్యానం చేసుకుని పడుకోవాలని, ఆందోళన కలిగించే సినిమాలు, సీరియల్స్ చూడడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు.

చెడు కలలు వస్తున్న వారు ఈ చిట్కాలు పాటించండి
చెడు కలలతో ఇబ్బంది పడుతున్న వారు నిద్రకుపక్రమించే ముందు దిండు కింద రెండు లవంగాలను పెట్టుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుందని చెబుతున్నారు. పడుకునేముందు గోరువెచ్చని నీటిలో పాదాలను శుభ్రం చేసుకోవాలని, కర్పూరం కలిపిన కొబ్బరినూనెను పాదాలకు రాసుకోవడం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుందని చెబుతున్నారు. తరచూ పీడ కలలతో ఇబ్బందిపడేవారు దిండు కింద ఇనుప కత్తి పెట్టుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాల నుండి బయట పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఇక ముఖ్యంగా మహిళలు పడుకునేటప్పుడు జుట్టు విరబోసుకుని పడుకోవడం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. ఇక పడుకునే ముందు ఎట్టిపరిస్థితుల్లోనూ మంచం కింద చెప్పులను విడిచి పెట్టకూడదు అని, బెడ్ కింద ఎటువంటి వస్తువులు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇక పడుకునే ముందు బెడ్ రూమ్ కు అటాచ్డ్ బాత్ రూమ్ తలుపులు మూసి ఉంచాలని అంటున్నారు. ఇక బెడ్ రూమ్ తలుపులు కూడా పూర్తిగా పెట్టుకోవాలని, సగం తలుపులు తీసి ఉంచటం మంచిది కాదని అంటున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications