వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: మనిషి జీవితకాలంలో ఆరేళ్ళపాటు కలలే.. ధనాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే కలలు ఇవే!!

|
Google Oneindia TeluguNews

కలలు .. కలల ప్రభావం మన జీవితంపై ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. కొన్ని కలలను మంచివి గానూ, కొన్ని కలలను చెడ్డవి గానూ.. అవి మన జీవితం పైన హానికరమైన ప్రభావం చూపిస్తాయని భావిస్తూ ఉంటారు. అసలు మనుషులకు తరచుగా వచ్చే కలలు ఏంటి? మనిషి జీవితంలో ఎన్ని సంవత్సరాలు కలలు కనే అవకాశం ఉంది? వంటి అనేక వివరాలను ఈరోజు మనం తెలుసుకుందాం.

మనిషి జీవితంలో ఆరేళ్ళు కలలు కనటానికే.. తరచుగా ఇలాంటి కలలే

మనిషి జీవితంలో ఆరేళ్ళు కలలు కనటానికే.. తరచుగా ఇలాంటి కలలే


మనిషి జీవితకాలంలో సరాసరి ఆరు సంవత్సరాల పాటు కలలు కనడానికి కేటాయించబడుతుంది అని అనేక అధ్యయనాలు తేల్చాయి. అంతేకాదు కలలను మనం ఎప్పటికీ నియంత్రించలేమని కూడా అధ్యయనాలు వెల్లడించాయి. అందరికీ తరచుగా వచ్చే కలల విషయానికి వస్తే ఎక్కువగా మనుషులకు ఎవరో తమని వెంబడిస్తున్నట్టు, ఎత్తు మీద నుంచి కిందికి పడిపోయినట్టు, తెలిసినవాళ్లు చనిపోయినట్టు, డబ్బులు దొరికినట్టు కలలు వస్తూ ఉంటాయి. ఈ కలలు మాత్రమే కాకుండా కలలో పాములు రావడం, దేవకన్యలు కనిపించడం, మనం చనిపోయినట్టు ఊహించుకోవడం, అతీంద్రియ శక్తులు మనకు వచ్చినట్టు కలలు కనడం, ఎక్కడో ఒక భయంకరమైన ప్రదేశంలో ఇరుక్కుపోయినట్టు కలలు కూడా తరచుగా వస్తూ ఉంటాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వచ్చే కలలివే

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వచ్చే కలలివే

అంతేకాదు కలలో శృంగారం, స్కూలు టీచర్లు కనిపించడం, పరీక్షలు రాయడం, పరీక్షలు తప్పడం, ఎక్కడికైనా లేటుగా హడావిడిగా వెళ్లడం, బాల్యంలోకి వెళ్లడం ఇలాంటి కలలే ఎక్కువగా వస్తుంటాయని పరిశోధనల్లో తేలింది. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇటువంటి కలలు కంటున్నట్టు అధ్యయనాలు వెల్లడించాయి. నిజ జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులు, మన జీవితంలో చోటుచేసుకునే సంఘటనల ఆధారంగానే మనకు కలలు వస్తూ ఉంటాయి అని కూడా అధ్యయనాలు తేల్చాయి. అయితే కలల ఆధారంగా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే అంచనాలు కూడా స్వప్న శాస్త్రం ఆధారంగా నిర్ధారించబడింది.

కొన్ని కలలు .. ఫలితాలు ఇవే

కొన్ని కలలు .. ఫలితాలు ఇవే

కొన్ని కలలు శుభ శకునాలను చూపిస్తూ మంచిని చేస్తే, బాగా సంపద వచ్చేలా చేస్తే.. మరికొన్ని కలలు అశుభ సంకేతాలుగా ఉంటాయని కూడా స్వప్న శాస్త్రం ఆధారంగా నిర్ధారించబడింది. కలలో ఏం వస్తే లాభం? ఏం వస్తే నష్టం? అనే కొన్ని విషయాలను గురించి చెప్పుకుంటే గాలిలో ఎగిరినట్లు కల వస్తే ఆస్తి నష్టం అని, నగ్నంగా నడుస్తున్నట్టు కల వస్తే కష్టాలు ఏమీ రావు అని చెబుతున్నారు. అంతేకాదు దేవతలు, గోవులు, అగ్ని, సరస్సులు, కన్య, ఫలాలు నదులు సముద్రాలు దాటడం, పర్వతాలు దాటడం వంటివన్నీ ధనాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించే కలలుగా చెబుతున్నారు. తూర్పు ఉత్తర దిక్కునకు పోయినట్టు, కోరుకున్న స్త్రీని పొందినట్టు, శవాన్ని చూసి నట్టు కల వస్తే కష్టాలు వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.

కలలో ఇవి కనిపిస్తే అదృష్టం .. సంపద, ఆరోగ్యం

కలలో ఇవి కనిపిస్తే అదృష్టం .. సంపద, ఆరోగ్యం


కలలో కుంకుమ మరియు కస్తూరి కనిపిస్తే మీకు కీర్తి అదృష్టం వస్తాయని, కలలో ఈ వస్తువులను కొనడం గాని తాకడం గాని చేస్తే మరింత శుభం చేకూరుతుందని చెబుతున్నారు. కలలో తామరపువ్వులు గులాబీ పువ్వుల వంటి దృశ్యం కనిపిస్తే మంచి ఆరోగ్యం వస్తుందని చెబుతున్నారు. కలలో పుస్తకాలు, గ్రంథాలు కనిపిస్తే మానసిక వికాసం మరియు మేధో వికాసం కలుగుతుందని చెబుతున్నారు. విద్యార్థులు మృతదేహాల గురించి కలలు కంటే అది వారిలో అభ్యాస నాణ్యతను మెరుగుపరుస్తుంది అని చెబుతున్నారు. వారికి విద్యపై ఆసక్తి పెరుగుతుందని, వారు ఏదైనా నేర్చుకోవడానికి చాలా కష్టపడే స్వభావాన్ని పెంచుకుంటారని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

vastu tips: ఇంట్లో, పూజగదిలో విగ్రహాలు పెడుతున్నారా? అయితే ఈ పొరబాట్లు చెయ్యకండి!!vastu tips: ఇంట్లో, పూజగదిలో విగ్రహాలు పెడుతున్నారా? అయితే ఈ పొరబాట్లు చెయ్యకండి!!

English summary
Studies have shown that a human spends six years of his life dreaming. Let's know about some dreams that give money and health and some dreams which are harmul. మనిషి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X