Astrology: అధిక శ్రావణమాసం: తులారాశి నుండి మీనరాశి వరకు; ఈ పరిహారాలతో శివయ్య అనుగ్రహం!!
అధిక శ్రావణ మాసం జులై నెల 18వ తేదీన ప్రారంభమైంది. ఈ అధిక శ్రావణ మాసాన్ని శూన్య మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో ఏ కొత్త పనులు, వివాహాది శుభకార్యాలు చెయ్యరాదు. అయితే అధిక శ్రావణమాసంలో ద్వాదశ రాశుల వారి జాతకాలలోనూ గణనీయమైన మార్పులు ఉంటాయి.
గ్రహాల కదలికల ఫలితంగా అనేక రాశుల వారు ఇబ్బందులను పడాల్సి వస్తుంది. మెరుగైన ఫలితాల కోసం కొన్ని పూజలు పరిహారాలు చేస్తే మంచిదని చెబుతున్నారు. ప్రస్తుతం తులా రాశి నుండి మీన రాశి వరకు ఆరు రాశుల వారు ఏం పరిహారాలు చెయ్యాలో తెలుసుకుందాం.

తులా రాశి వారు అధిక శ్రావణ మాసంలో మంచి ఫలితాల కోసం బిల్వపత్రాలతో, ఎర్రటి పువ్వులతో శివుడిని పూజించాలి. శివునికి గంగాజలంతో కానీ తేనెతో కానీ రుద్రాభిషేకం చేయాలి. ఓం నమశ్శివాయ మంత్రాన్ని జపించాలి. అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయి.
అధిక శ్రావణ మాసంలో వృశ్చికరాశి వారు శివునికి ఎర్రని పూలను సమర్పించాలి. పాలని పలువురికి దానం చేయాలి. వీరు ఓం హోం ఓం జున్ మంత్రాన్ని జపిస్తే మంచిది. మంచి ఫలితాల కోసం అధిక శ్రావణంలో ధనస్సు రాశి వారు పసుపు, ఆవు పాల మిశ్రమంతో శివునికి అభిషేకం చేయాలి. శివుడికి తేనెను సమర్పించవచ్చు. పసుపుపచ్చని పువ్వులు, చందనం, బిల్వపత్రాలను సమర్పించాలి. ఓం నమశ్శివాయ గురుదేవాయ నమః అని జపించాలి.
అధిక శ్రావణ మాసంలో మకర రాశి వారు శివునికి జలాభిషేకం చేయాలి. నీలి పుష్పాలు, బిల్వ పత్రాలను, ఉమ్మెత్త పూలను సమర్పించాలి. శివానుగ్రహం పొందటానికి ఓం హోం ఓం జున్ మంత్రాన్ని జపించాలి. అప్పుడే జాతకంలో ఉన్న దోషాలు పోయి జీవితం సాఫీగా సాగుతుంది.
కుంభరాశి వారు నీలి పుష్పాలు, శమీ పుష్పాలతో పూజించాలి. నువ్వుల నూనెతో రుద్రాభిషేకం చేయించాలి. ఓం హోం ఓం జున్ మంత్రాన్ని జపించాలి. మీనరాశి జాతకులు మంచి ఫలితాల కోసం శివునికి జలాభిషేకం చెయ్యాలి. గంధం, కుంకుమ సమర్పించాలి. పసుపు పచ్చని పూలు సమర్పించాలి. మహా దేవునికి పసుపు ఆవాలు సమర్పించాలి. ఓం నమశ్శివాయ గురుదేవాయ నమః మంత్రాన్ని జపించాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications