Budh gochar 2023: నేడు ఈ రాశులవారికి బుధాదిత్య రాజయోగం; లక్కీ ఫెలోస్!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు జూలై 25వ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలోకి బుధ సంచారం వల్ల అనేక రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అంతేకాదు సింహరాశిలో బుధుడు సూర్యుడు కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. నేడు బుధాదిత్య రాజయోగం కారణంగా లబ్దిపొందే రాశుల వివరాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మూడు రాశులకు బుధాదిత్య రాజయోగం లబ్ధిని చేకూరుస్తుంది.
సింహరాశిలోకి బుధ సంచారం వల్ల వృషభరాశి జాతకులకు ఆకస్మిక ధన లాభాన్ని ఇస్తుంది. జీవితంలో సంతోషం వెల్లి విరుస్తుంది. వృషభరాశి వారి ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఉద్యోగానికి సంబంధించిఉన్నతాధికారుల మన్ననలు పొందడంతో పాటు, వారి నుంచి మంచి ప్రోత్సాహాన్ని కూడా పొందుతారు. కొత్త కెరీర్ అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తులకు అధికలాభాలకు ఆస్కారం ఉంది. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది.

సింహరాశిలోకి బుధ సంచారం వల్ల బుధ గోచారం కారణంగా మకర రాశి జాతకులకు లాభిస్తుంది. బుధ గ్రహ గోచారం కారణంగా మకర రాశి వారికి అదృష్టం వస్తుంది. ప్రతి పనిలోను విజయాన్ని సాధిస్తారు. కొత్త ఆస్తులను, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులు, వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇది సరైన సమయం. వీరి లవ్ లైఫ్ చాలా బాగుంటుంది. పరిశోధన రంగంలో ఉన్నవారికి అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు.
సింహరాశిలో బుధ గ్రహ గోచారం వల్ల తులా రాశి వారికి కలిసొస్తుంది. బుధ గ్రహ గోచారం ఈ రాశి వారికి ఊహించని డబ్బును తెస్తుంది ఈ సమయంలో ఖర్చులు తగ్గి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. తులారాశి జాతకులు తమ ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఇది సరైన సమయం. వృత్తి వ్యాపారాలలో ఈ సమయంలో దూసుకుపోతారు. కెరీర్ లో గణనీయమైన పురోగతి ఉంటుంది. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బకాయిలు కూడా ఈ సమయంలో వసూలవుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications