అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేరా? చింతించకండి; ఇవి తెచ్చుకోండి చాలు!!

అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే మేలు జరుగుతుందని లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం విపరీతంగా పెరిగిన బంగారం ధరలతో అక్షయ తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయడానికి సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇక అలాంటివారు అక్షయ తృతీయనాడు బంగారం కొనుగోలు చేయలేదని చింతించవలసిన అవసరం లేదు.

అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే బంగారాన్ని కొనుగోలు చేస్తే ఎటువంటి ఫలితం అయితే ఉంటుందో, అంతటి మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. భారతీయుల పండుగలలో అక్షయ తృతీయ కు చాలా విశిష్టమైన స్థానం ఉంటుంది .ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియనాడు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.

Cant buy gold on Akshaya Tritiya? dont worry Just get these things home!!

శ్రీ మహాలక్ష్మి శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా, పరమశివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన శుభ సందర్భంగా అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన గురువారం నాడు అక్షయ తృతీయ పండుగ వచ్చింది. అయితే ఈ రోజు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే, కొన్ని పనులు చేస్తే శుభ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

అక్షయ తృతీయ పండుగ రోజు బంగారాన్ని కొనుగోలు చేయడం కంటే, దానధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అంతేకాదు అక్షయ తృతీయ పండుగ నాడు దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ శంఖాన్ని దైవంగా భావించి పూజ గదిలో ఉంచి పూజిస్తే, ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందని చెబుతున్నారు. అంతేకాదు ఏకాక్షి కొబ్బరికాయ తెచ్చి లక్ష్మీదేవి రూపంగా భావించి పూజిస్తే, ఆ ఇంట్లో సిరిసంపదలు ఉంటాయని సూచిస్తున్నారు.

అక్షయ తృతీయ పండుగ నాడు శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుందని, ముఖ్యంగా పాదరస శివలింగాన్ని తెచ్చుకొని ఇంట్లో నియమనిష్ఠలతో పూజించడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందని చెబుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేయకున్నా ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుందని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+