పూజ గదిలో దేవుడి ఫొటోలు ఎక్కువగా ఉంటే పాటించాల్సిన వాస్తు నియమాలు తెలుసా?
ఇల్లు అన్న తర్వాత ప్రతి ఒక్కటి వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటాం. పూజ గదిలో చాలామంది దేవుడి ఫొటోలు చాలా ఎక్కువగా పెడుతుంటారు. కొంతమంది అయితే లెక్కలేనన్ని ఫొటోలు పెడతారు. ఎవరైనా బహుమతిగా ఇవ్వడం, దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవుడి పటాలు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవడంలాంటి కారణాలతో రోజురోజుకు పూజాగదిలో దేవుడి ఫొటోలు పెరుగుతూనే ఉంటాయి. ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి? పాటించాల్సిన వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం.
ఫొటోలు ఎక్కువైనప్పుడు వాటిని తీస్తూ ఉండాలి.
హాలులో, బెడ్ రూపంలో ఇవి ఉండకూడదు.
కొత్త ఫోటోలను పెట్టి పాతవి తొలగించండి.
ఎప్పటికీ ఆ ఫొటో ఉండాలి.. లేదంటే పాపం తగులుతుంది అనే భయం వద్దు. అలా జరగదు.

ఫొటోలను కొంతమంది గుళ్లల్లో వదిలేస్తుంటారు.
మరికొందరు నదుల్లో కలుపుతుంటారు.
నదిలో పారేయకూడదని పండితులు చెబుతున్నారు.
తీసేసిన ఫొటోలను ఎవరికైనా ఇస్తే మంచిది.
ఎవరూ తీసుకోకపోతే వాటిని ఇంట్లో ఒకచోట పెట్టండి.
పూజ గదిలో పాటించాల్సిన వాస్తు నియమాలు చాలా ఉంటాయి.
దేవుడి విగ్రహాలను తూర్పు లేదా పడమర వైపు ఉంచాలి.
విగ్రహాలు 9 అంగుళాలు దాటి ఉండకూడదు.
2 అంగుళాలకంటే చిన్నవిగా కూడా ఉండకూడదు.
ఉగ్రరూపం కలిగిన కాళికాదేవి, శనిదేవుడి లాంటి విగ్రహాలు పెట్టొద్దు.
దీనివల్ల ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటారు.
పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి.
దీనివల్ల అదృష్టం కలిసివస్తుంది.












Click it and Unblock the Notifications