ధనత్రయోదశి నాడు ఈ జాగ్రత్తలు పాటించండి చాలు.. ధనలక్ష్మి మీ ఇంటికి నడిచొస్తుంది!

రేపే ధన త్రయోదశి. ధన త్రయోదశి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశినాడు వస్తుంది. ధన త్రయోదశి రోజు కుబేరుడిని, లక్ష్మీదేవిని, ధన్వంతరిని ప్రత్యేకంగా పూజిస్తారు. ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే మనం కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు చేయకుండా ఉండాలి. మరి అవి ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

ధన త్రయోదశి నాడు ఈ పొరబాట్లు చెయ్యకూడదు
అక్టోబర్ 18 ధన త్రయోదశి చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి చాలామంది రకరకాల పరిహారాలను పాటిస్తారు. మత విశ్వాసాల ప్రకారం ధన త్రయోదశి నాడు కొన్ని పొరపాట్లు చేయకుండా చూడాలి. ఈ పొరపాట్లు చేస్తే పేదరికం ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే రకరకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక ధన త్రయోదశి రోజు ఎటువంటి పొరపాట్లు చేయకూడదు అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

don t do these mistakes on Dhanteras and Goddess Lakshmi will visit your home

ఈ పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపం
ధన త్రయోదశి రోజు సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లు ఊడవడం, తుడవడం వంటివి చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక సాయంత్రం పూట ఇల్లు ఊడవడం, తుడవడం వంటివి అస్సలు చేయకూడదు. ఇక ధన త్రయోదశి రోజు సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు. అలాంటి సమయంలో తలుపులు మూసి వేయడం వంటివి చేయకూడదు.

ఈ పనులు అసలే చెయ్యొద్దు.. చేస్తే పేదరికం
దీపాలు వెలిగించడం, లైట్లు వేయడం వంటి చర్యలతో పాటు తలుపులు తెరిచి ఉంచితే ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. ధన త్రయోదశి రోజు ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. అలా చేస్తే కుబేరుడికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ధన త్రయోదశి రోజు చీకటి పడిన తర్వాత ఎవరికి ఉప్పు, పెరుగు, పుల్లటి పదార్థాలు ఇవ్వడం మంచిది కాదు.

ఇంటికి ఖాళీ గిన్నెలు తీసుకురావద్దు
ఉప్పు, పెరుగు వంటి పదార్ధాలు రాత్రి వేళ ఇస్తే రాహువు కారణంగా అశుభ ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది. ధన త్రయోదశి రోజు ఇంటికి ఖాళీ గిన్నెలను తీసుకు రాకూడదు. ఎవరైనా ధన త్రయోదశికి రాగి, కంచు, ఇత్తడి పాత్రలు కొనుగోలు చేస్తే వాటిలో బియ్యం, బెల్లం, పంచదార వంటి పదార్థాలను వేసి ఇంటికి తీసుకురావాలి. ఇలా చేస్తే ఇంట్లో శుభ ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తద్వారా అందరూ సంతోషంగా ఉండవచ్చు.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+