నవంబరు, డిసెంబరులో ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే
ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్న శుక్రుడు వచ్చేనెల మొదటివారంలో ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అనంతరం అదే నెల 15వ తేదీన తన సొంత రాశి కుంభరాశిలోకి వెళతాడు. 16వ తేదీన సూర్యుడు కూడా వృశ్చిక రాశిలోకి వచ్చి డిసెంబరు 16 వరకు నెలరోజులు అక్కడే ఉంటాడు. నవంబరు 26వ తేదీ నుంచి బుధుడి సంచారం ఉంటుంది. ఇలా ఈ ప్రధానమైన గ్రహాల సంచారం మొత్తం శుభప్రదంగా సాగుతుంది. ఈ ఏడాది చివరి రెండు నెలలు నవంబరు, డిసెంబరు కొన్ని రాశులకు వరంగా మారబోతున్నాయి. ఏ రాశులకు ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.
వృషభ రాశి
ఈ రాశిలో బృహస్పతి తిరోగమనంలో ఉన్నాడు. దీనివల్ల రానున్న రెండు నెలలు ఈ రాశివారికి గురుడు మంచి ఫలితాలను ప్రసాదిస్తున్నాడు. వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా సాగుతుంది. డబ్బు వచ్చి సంపద పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుండి విజయాలను అందుకుంటారు. దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయి.

కర్కాటక రాశి
వీరికి రానున్న రెండు నెలలు ఎంతో జాలీగా గడిచిపోతాయి. డిసెంబరు 25 క్రిస్మస్ వరకు వీరికి తిరుగులేదని చెప్పొచ్చు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తోపాటు వేతనం పెరుగుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. పెద్ద పెద్ద విజయాలను అందుకుంటారు. అందుకు వీరికి అదృష్టం తోడుంటుంది.
తులా రాశి
నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. కొత్త కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పెళ్లికానివారికి జీవిత భాగస్వామి దొరుకుతుంది. వివాహం నిశ్చయమవుతుంది.
వృశ్చిక రాశి
నవంబరు, డిసెంబరు రెండు నెలలు వీరికి అద్భుతంగా గడుస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు లేదంటే తీర్థయాత్రకు వెళతారు. ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్నచోట ఉన్నతస్థాయికి చేరుకుంటారు. ఊహించనిరీతిలో ఈ రాశివారు ప్రయోజనాలను పొందబోతున్నారు. డబ్బు సంపాదన బాగుంది.
కుంభ రాశి
చివరి రెండు నెలలు వీరికి బంగారు రోజులని చెప్పొచ్చు. జీవితంలో మీరు కోరుకుంటున్న మార్పు చోటుచేసుకుంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టే పెట్టుబడులు లాభాలనిస్తాయి. ఏలిననాటి శని నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలున్నాయి. జీవితంలో వృద్ధిలోకి వస్తారు.












Click it and Unblock the Notifications