వీరు జీవితాంతం కోటీశ్వరులు.. నామాటే శాసనం అన్న కుబేరుడు!
కుబేరుడు... సంపదలకు అధిదేవుడు. హిందూ ధర్మ శాస్త్రాలలో కుబేరుడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కుబేరుడి కటాక్షం ఉంటే వారు అపార సంపదలతో తులతూగుతారు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కుబేరుడు ఏదో ఒక సమయంలో కటాక్షిస్తాడు. కానీ కొన్ని రాశుల వారికి కుబేరుడు ఎప్పటికి తన కటాక్షాన్ని అందిస్తాడు. కుబేరుడుకి ఇష్టమైన ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
కుబేరుడికి ఇష్టమైన రాశులు
ముఖ్యంగా కుబేరుడికి ద్వాదశ రాశులలో ఐదు రాశుల పట్ల విపరీతమైన ఇష్టం ఉంటుంది. సహజంగా ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క రాశి పాలిస్తుంది .ఆయా రాశులను పాలించే గ్రహాలను బట్టి ఆయా రాశులను అనుగ్రహించే దేవుళ్ళు కూడా ఉంటారు. అలా కుబేరుడు ఐదు రాశులను పాలించే గ్రహాలను బట్టి వారికి తన కటాక్షాన్ని ఇస్తున్నాడు.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులపైన కుబేరుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. వృషభ రాశికి శుక్రుడు అధిపతి కాగా, సంపదకు శుక్రుడిని ప్రతీకగా భావిస్తారు. ఇక శుక్ర గ్రహం పాలించే వృషభరాశి జాతకులపైన కుబేరుడు సంపదల వర్షం కురిపిస్తాడు. వీరు ఏ పని చేపట్టినా కుబేరుడు దయతో పూర్తవుతుంది. వృషభ రాశి వారు కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవించే అవకాశం ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులు కుబేరుడు అనుగ్రహంతో సంతోషంగా జీవిస్తారు. చంద్రుడు కర్కాటక రాశిని పాలిస్తాడు. చంద్రుడు పాలించే కర్కాటక రాశి జాతకులను కుబేరుడు కరుణిస్తాడు వీరి జీవితంలో భారీగా డబ్బు సంపాదించే అవకాశాన్ని కుబేరుడు కలిగిస్తాడు. వీరికి జ్ఞానం, తెలివితేటలు ఉంటాయి. వీటి వల్ల వీరు అనేక విజయాలను సాధిస్తారు.
ధనుస్సు రాశి
కుబేరుడు బాగా ఇష్టపడే రాశి ధనస్సు రాశి. బృహస్పతి ధనుస్సు రాశికి అధిపతి. ఇక బృహస్పతి పాలించేది ధనస్సు రాశి జాతకులను కుబేరుడు ఎప్పటికప్పుడు కటాక్షిస్తూ ఉంటాడు. ధనుస్సు రాశి జాతకులు ఆధ్యాత్మికతలో ఎక్కువగా ఉండటం వల్ల వీరికి కుబేరుడి ఆశీర్వాదం లభిస్తుంది. వీరు ఎల్లప్పుడూ సంపదలతో తులతూగుతారు.
తులారాశి
తులారాశి జాతకులపై కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. తులారాశికి శుక్రుడు అధిపతి. శుక్రుడు పాలించే తులా రాశి పైన కుబేరుడి కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది. ఎటువంటి డబ్బు సమస్యలు లేకుండా కుబేరుడు చూస్తాడు. మీరు దానధర్మాలను చేసే స్థాయికి కుబేరుడు అనుగ్రహిస్తాడు.
వృశ్చిక రాశి
కుబేరుడు అనుగ్రహం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు కలిసి వస్తుంది. వృశ్చిక రాశికి అంగారకుడు అధిపతి. అంగారకుడు పాలించే రాశి అయిన వృశ్చిక రాశిపై కుబేరుడు సంపదల వర్షం కురిపిస్తాడు. అన్ని రంగాలలోనూ వీరికి విజయం వహించేలా చూస్తాడు. డబ్బు సమస్యలు లేకుండా ఆశీర్వదిస్తాడు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications