ఈ నెల 29 నుంచి ఈ రాశుల దశ, దిశ మారుతోంది.. సంపద పెరుగుతోంది!
నాగుల పంచమి, నాగ పంచమి అన్నా ఒకటే. చాలా సాంప్రదాయమైన పండగల్లో ఇది ఒకటి. నాగులకు ఆరోజు పాలు పోసి పూజిస్తారు. మనకున్న 84 లక్షల కోట్ల జీవరాశుల్లో పాము కూడా ఒకటి. మనుషులకు హాని చేసే పాములను సైతం పూజించాలని చెప్పడమే నాగపంచమి పండగ ఉద్దేశం. ఆరోజు శుక్రుడు కూడా మిథునరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేరోజు సిద్ధియోగం ఏర్పడి లక్ష్మీనారాయణ యోగం కలుగుతోంది. శనిదేవుడి నుంచి శశి యోగం రాబోతోంది. ఇలా అన్నిరకాలుగా కలిసివస్తున్న నాగపంచమికి లాభపడే రాశుల గురించి తెలుసుకుందాం.
కుంభ రాశి
విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. ఒకరకంగా ఈ రాశివారికి అదృష్టం తుమ్మబంకలా పడుతుంది. ఉద్యోగస్థులకు, వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగంలో చేరడానికి ఇది మంచి సమయం.

మేష రాశి
పనిలో వృద్ధి సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. జీవితంలో ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలన్నీ దూరమవుతాయి. సంపద పెరుగుతుంది. ఆర్థికంగా బలోపేతమవుతారు.
తులా రాశి
దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. పనిలో విజయాన్ని అందుకుంటారు. వివాహం కానివారికి త్వరలోనే పెళ్లి కుదురుతుంది. జీవితాల్లో అపారమైన వెలుగులను నాగపంచమి తీసుకురాబోతోంది.
సింహ రాశి
ఉద్యోగస్థులకు వేతనం పెరుగుతుంది. పదోన్నతి కూడా వస్తుంది. చేసే పనిల్లో కచ్చితంగా విజయాన్ని అందుకుంటారు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడి అందరూ సంతోషంగా ఉంటారు. ఆనందం వెల్లివిరుస్తుంది. ఉద్యోగం చేసేవారు కొత్త ఉద్యోగంలో చేరతారు. నాగపంచమి ఈ రాశులవారికి అదృష్టాన్ని తీసుకురాబోతోంది.
వృషభ రాశి
సమాజంలో గౌరవాన్ని అందుకుంటారు. హోదా పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. చేసే ప్రతి పనిలోను వీరు విజయాన్ని చాలా సులువుగా సాధిస్తారు. సంపద పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. గతంలోకంటే ఇప్పుడు జీవితం అన్నిరకాలుగా చాలా మెరుగ్గా ఉంటుంది.












Click it and Unblock the Notifications