కార్తీక మాసంలో ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే
అన్ని మాసాల్లో అత్యంత కీలకమైన మాసం, అత్యంత పవిత్రమై మాసం కార్తీక మాసం. దీన్ని మించిన మాసం లేదని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలోనే కొన్ని రాశులవారికి అదృష్టం కలిసివస్తోంది. ఒకరకంగా ఈ రాశులవారు పట్టిందల్లా బంగారంలా మారుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
సింహ రాశి
గ్రహాలన్నీ వీరికి అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ జీవితంలో సంతోషం నెలకుంటుంది. వృత్తిలో ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. అన్నిరకాలుగా వీరికి శుభప్రదంగా కార్తీకమాసం గడుస్తుంది.

ధనుస్సు రాశి
వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. ఎటువంటి భయాందోళనలు లేకుండా కొత్త పనులు ప్రారంభిస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. పెండింగ్ పనులన్నిటినీ పూర్తిచేస్తారు.
కర్కాటక రాశి
న్యాయపరమైన కేసుల్లో కోర్టు తీర్పులు అనుకూలగా వస్తాయి. ఉమ్మడి ఆస్తులున్నవారు వాటి నుంచి ప్రయోజనం పొందుతారు. ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమవుతాయి. పాత స్నేహితులతో పరిచయాలు మళ్లీ ఏర్పడతాయి. కార్తీక మాసం మొత్తం వీరికి ఎంతో శుభ్రదంగా ఉంటుంది.
తులా రాశి
ఈ రాశివారికి తోబుట్టువుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. దీనివల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు బాగా వృద్ధిలోకి వస్తారు. ఏ ప్రయత్నం చేసినా ఫలితం బాగుంటుంది. విదేశాలకు వెళ్లే అవకాం ఉంది. చదవులో విద్యార్థులు బాగా రాణిస్తారు. కార్తీక మాసం మొత్తం ఈ రాశివారికి బాగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.
కుంభ రాశి
అనేక అడ్డంకుల నుంచి విముక్తి లభిస్తుంది. సంపదలో స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అన్ని పనులు విజయవంతమవుతాయి. ఆర్థిక లాభాలున్నాయి. వృత్తి పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications