శని గోచారంతో ఈ రాశులకు ఐశ్వర్యం

గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాయి. ఇలా ప్రవేశించడంవల్ల కొన్ని రాశులవారికి సానుకూల పరిణామాలు ఎదురైతే, మరికొన్ని రాశులవారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. శని దేవుడు ఈ ఏడాది అక్టోబరు మూడోతేదీ వరకు పూర్వాభాద్రలో ఉంటాడు. తర్వాత శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్యం ప్రకారం శనిదేవుడి సంచారం ప్రధానంగా నాలుగు రాశులవారికి బాగా కలిసిరానుంది. వాటి వివరాలను తెలుసుకుందాం.

మేషరాశి
ఆర్థిక పరిస్థితి గతంకంటే ఉన్నతంగా మారుతుంది. ఇల్లు, ప్లాట్లు, భూమి లాంటివాటిని కొనుగోలు చేస్తారు. వ్యాపారంతోపాటు వృత్తిలో ఉన్నవారు కూడా లాభపడతారు. శనిదేవుడి ఆశీర్వాదం లభిస్తుంది. ఎంతో ఏకాగ్రతతో భగవంతుడిని పూజించాలి. దీనివల్ల అన్ని పనులు విజయవంతమవుతాయి. వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న మనస్పర్థలున్నప్పటికీ ఎవరో ఒకరు సర్దుకుపోవడంవల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు.

four zodiac signs very lucky due to shani gochar 2024

వృషభ రాశి
శనిదేవుడి అనుగ్రహం ఈ రాశివారికి లభిస్తుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు వారివారి స్థానాలు పెరుగుతాయి. ఆదాయం పెరగడంతోపాటు లాభం కూడా పెరుగుతుంది. సమాజంలో హోదా లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. పనుల నిమిత్తం దూర ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఇవి కూడా ఎంతో లాభసాటిగా ఉంటాయి. వైవాహిక జీవితంలో భాగస్వామి నుంచి ప్రేమ లభిస్తుంది. అదృష్టం తోడుండటంవల్ల డబ్బుకు కొరత ఏర్పడదు.

కన్యా రాశి
జీవితంలో ఆహ్లాదకరమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పులను చెల్లించేస్తారు. ఆదాయ వనరులను పెంచుకుంటారు. కెరీర్ పరంగా కొత్త అవకాశాలను సాధిస్తారు. వాటిని చేజార్చుకోకుండా చూడాలి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

ధనుస్సు రాశి
నచ్చిన ఉద్యోగం దొరుకుతుంది. కొత్త ఉద్యోగానికి సమయం అనుకూలంగా ఉంది. శారీరక, మానసిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారవేత్తలు తమ ప్రణాళికలను అమలు చేస్తారు. లాభాలున్నాయి. వ్యాపారంలో మంచి పురోగతి ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది. శుభవార్తలను వింటారు.

శనివారం రోజు ఉపవాసం ఉండి శని దేవుడిని ఆరాధించాలి. పేద ప్రజలకు సహాయం చేయడంవల్ల శనిదేవుడి ఆశీస్సులు అందుకుంటారు. ఎప్పుడూ మంచి పనులు మాత్రమే చేస్తుండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+