2025లో ఈ రాశుల కోసం ఖాళీ చెక్కులను రాసిచ్చిన రెండు రాజయోగాలు

గ్రహాలు నిర్దిష్ట సమయం ముగిసిన తర్వాత ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాయి. వీటిని సంచారం చేయడం అంటారు. మొత్తం నవగ్రహాలన్నీ 12 రాశుల్లో సంచారం చేస్తుంటాయి. ఇవి సంఘ జీవితంపై, మానవుడి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంటాయి. 2025 కొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీన మాలవ్య రాజయోగం, కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతున్నాయి. మార్చిలో రాశిని మార్చుకుంటున్న శనిదేవుడి ప్రభావం కూడా రాశులపై పడుతుంది. ప్రధానంగా నాలుగు రాశులవారికి మాత్రం ఆర్థికంగా, సామాజికంగా కలిసిరానుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.

మేష రాశి
వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఈ ఏడాది వీరికి బాగా కలిసివస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ ఉన్నాయి. పెళ్లి కానివారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఉన్నవారు సంతోషంగా జీవిస్తారు. ఇప్పటివరకు ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు వెళతారు. పిల్లల నుంచి శుభవార్తలు ఉన్నాయి. కష్టపడినదాన్ని బట్టి ఫలితాలుంటాయి. డబ్బుకు లోటు లేదు. ఆకస్మిక ధనలాభం ఉంది.

four zodiac signs will get amezing benefits and more money due to malavya rajayogam and kendra trikona rajayogam

తులారాశి
ఈ సమయం మొత్తం వీరికి ఎంతో అద్భుతమైందని చెప్పొచ్చు. గతంలో వేరేవారిచేతిలో నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెంచుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం లభించడంతోపాటు ఆర్థిక లాభాలుంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

మకర రాశి
కోర్టుకు సంబంధించిన న్యాయ వ్యవహారాల్లో విజయాన్ని అందుకుంటారు. సమాజంలో గౌరవం, హోదా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మీ వ్యవహారశైలే మీకు పేరు తెచ్చిపెడుతుంది. ధనంలో వృద్ధి ఉండటంతోపాటు వ్యాపారంలో లాభం ఉంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నవారు మీ గురువుల సలహా సంప్రదింపులతో ప్రారంభిస్తే ఉత్తమం. మంచి సమయం చూసుకోవాల్సి ఉంటుంది.

కుంభం
ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి కలుగుతుంది. గ్రహాలకు రాకుమారుడైన బుధుడి నుంచి ప్రత్యేక ఆశీర్వాదం అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగం రావొచ్చు లేదంటే ప్రభుత్వ ఉద్యోగితో వివాహం కావొచ్చు. ఇంటికి కొత్త అతిథి వస్తారు. వారిని ఆదరించడం మీ కర్తవ్యం. అదనపు ఆదాయానికి మార్గాలు దొరికినప్పటికీ మీ మాటతీరువల్ల వాటిని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం మేలు చేస్తుంది. అది మీకు కలిసివస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+