శని నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశుల తలరాత మారిపోతోంది
సూర్య భగవానుడు గ్రహాలకు అధిపతి. ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ఈనెల 20వ తేదీన పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీనికి న్యాయదేవుడైన శనిదేవుడు అధిపతి. సూర్యుడు, శని.. ఇద్దరికీ తండ్రీ కొడుకుల అనుబంధం ఉంటుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి మంచి సానుకూల ప్రయోజనాలు దక్కుతున్నాయి. శుభవార్తలు వింటారు. ఏయే రాశులకు ఏ విధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కన్యారాశి
కుటుంబ సభ్యులతో అధిక సమయాన్ని గడుపుతారు. అందరూ కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. డబ్బు సంపాదనకు సంబంధించి అనేక మార్గాలు దొరుకుతాయి. సంపాదన పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారి సంబంధాలు మరింత బలపడతాయి. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి.

కర్కాటక రాశి
ఈ రాశివారి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగస్థులు వారి వారి కార్యాలయాల్లో పెద్ద పెద్ద బాధ్యతలు స్వీకరిస్తారు. ఒత్తిడిని తట్టుకుంటారు. సంపాదన పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఆదాయాన్ని ఆర్జిస్తారు. కార్యాలయాల్లో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
తులారాశి
వీరికి ధైర్యం ఎక్కువ. నిరుద్యోగులకు మంచి మంచి ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు దక్కించుకుంటారు. అలాగే ఉద్యోగం చేస్తున్నవారు వారి ఉద్యోగం మారాలనుకుంటే ఇది మంచి సమయం. వారికి మంచిగా కలిసివస్తుంది. ఏ పని తలపెట్టినా అందులో అదృష్టం తోడుండి విజయం దక్కించుకుంటారు. వ్యాపారస్తులకు, వృత్తిలో ఉన్నవారికి కూడా ఇది అద్బుతమైన సమయం అని చెప్పొచ్చు.
కన్యా రాశి
ఉద్యోగస్థులకు బదిలీలున్నాయి. పెరిగిన వేతనంతో పదోన్నతి లభిస్తుంది. ఈ రాశివారి సంపాదన పెరుగుతుంది. డబ్బ భారీగా సంపాదిస్తారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చుకునే సామర్థ్యం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది.












Click it and Unblock the Notifications