శుక్రుడు-శని సంయోగం... ఈ రాశులకు ఊహించని ఐశ్వర్యం
జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు సంపదకు, విలాసవంతమైన జీవితానికి, అందానికి, కళకు, ఆనందానికి, ప్రతిభకు, శృంగారికి కారకుడు. శనిదేవుడు న్యాయదేవుడు. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తుంటాడు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే అంతకు రెట్టింపుగా ఫలితాలుంటాయి. ఈ రెండు గ్రహాలు ఈనెల 28న కలుసుకున్నాయి. ఇలా రెండు గ్రహాలు కలవడంవల్ల కొన్ని రాశులకు ఎంతో శుభదాయకంగా ఉంటోంది. నాలుగు రాశులవారు మంచి ఫలితాలను పొందబోతున్నారు. వాటి వివరాలను, అందులో మీ రాశి ఉందా? లేదా? అనే విషయాలను తెలుసుకుందాం.
సింహ రాశి
ప్రేమలో ఉన్నవారు అందులోని మాధుర్యాన్ని అనుభవిస్తారు. కొంతకాలంగా ఉన్న ఆస్తి సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఉద్యోగస్థులకు ప్రమోషన్ ఉంటుంది. అది లేకపోతే వేతనం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. వీరి జీవితంలో అన్నీ సానుకూల మార్పులే ఉంటాయి. జీవితంలో ఆనందం ఉంటుంది. అందరితో సఖ్యతగా ఉంటారు. అది మీకు మేలు చేస్తుంది.

తులా రాశి
ఉద్యోగస్థులకు వారి పై అధికారుల నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంతోపాటు వ్యాపారానికి సంబంధించి విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. అదృష్టం బాగా ఉంది. ఆర్థికంగా ఒక స్థాయి వస్తుంది. సమాజంలో మంచి గౌరవంతోపాటు హోదా పెరుగుతుంది. వృత్తితోపాటు వ్యాపారంలో కూడా అద్భుతమైన పురోగతి ఉంటుంది.
మేష రాశి
విద్యార్థులకు బాగుంటుంది. వారు చదువులో మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు పూర్తి ఆత్మవిశ్వాసంతో, శక్తివంతంగా పనిచేస్తారు. విదేశాల్లో చదవాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. శుభవార్తలను అందుకుంటారు. అదృష్టం తోడుండటంవల్ల కొత్త పనులు ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ధన ప్రవాహం ఉంది. పాత పెట్టుబడుల నుంచి ఈ సమయంలో రాబడిని అందుకుంటారు.
మిథున రాశి
కొత్తగా ఆస్తిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. అదృష్టం బాగా కలిసివస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. విద్యార్థులకు విదేశాల్లో చదవాలనే కోరిక తీరుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఈ రాశివారు పొందుతారు.












Click it and Unblock the Notifications