వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: పరగడుపున టీ,కాఫీ తాగుతున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే!!

|
Google Oneindia TeluguNews

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ప్రస్తుత సమాజంలో ఆ మహాభాగ్యమే అందరికీ కరువుగా మారుతుంది. అందుకు కారణం మన జీవన శైలి విధానం. మన జీవితం మనం తీసుకునే ఆహారం పైన, మన అలవాట్ల పైన ఆధారపడి ఉంటుంది. సరైన ఆహారపు అలవాట్లు లేనివారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. మెరుగైన ఆరోగ్యం కావాలనుకునేవారు ఒక క్రమబద్ధమైన జీవితాన్ని అలవర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఉదయం లేవగానే బెడ్ కాఫీలు, బెడ్ టీలు తాగుతున్నారా? అయితే హెచ్చరిక

ఉదయం లేవగానే బెడ్ కాఫీలు, బెడ్ టీలు తాగుతున్నారా? అయితే హెచ్చరిక

ఉదయం లేవగానే చాలామందికి బెడ్ కాఫీ లు , బెడ్ టీలు తాగే అలవాటు ఉంటుంది. అలా బెడ్ కాఫీ లు, బెడ్ టీలు తాగే వాళ్ళు ఆరోగ్య విషయంలో ప్రమాదంలో పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో బెడ్ కాఫీలు, బెడ్ టీలు తాగడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని చెబుతున్నారు. కాఫీ, టీ తాగడం మరీ ప్రమాదకరం కాదు కానీ, మితంగా కాకుండా అతిగా తీసుకుంటే, నిద్రలేవగానే తాగితే ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

పరగడుపున బెడ్ టీ తాగటం మంచిది కాదు ,. కారణాలివే

పరగడుపున బెడ్ టీ తాగటం మంచిది కాదు ,. కారణాలివే

ఉదయం లేచిన వెంటనే పరగడుపున బెడ్ టీ తాగకూడదు అని అని చెప్పడం వెనుక ప్రధాన కారణం ఉందని చెబుతున్న వైద్యులు ఉదయం ఖాళీ కడుపుతో బెడ్ టీ తాగడం వల్ల శరీర ప్రాథమిక సమతుల్యత దెబ్బతింటుంది అని, ఇది ఎసిడిటీకి, అజీర్ణానికి దారితీస్తుందని చెబుతున్నారు. టీలో థియోఫిలిన్ అనే సమ్మేళనం ఉంటుంది అని, అది నిర్జలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది కొందరిలో మలబద్ధకాన్ని కలిగించే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

ఉదయం లేవగానే టీ,కాఫీలు తాగితే జరిగేది ఇదే

ఉదయం లేవగానే టీ,కాఫీలు తాగితే జరిగేది ఇదే

అంతేకాదు ఉదయం టీ లేదా కాఫీ తీసుకున్నవారిలో నోటిలోని బ్యాక్టీరియా చక్కెరను విచ్ఛిన్నం చేస్తుందని ఇది నోట్లో యాసిడ్ స్థాయిలను పెంచుతుందని చెబుతున్నారు. అంతేకాదు పరగడుపున టీ తాగడం వల్ల పంటి ఎనామిల్ కోతకు గురవుటుందని, పళ్ళు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక చాలామంది రాత్రి పగలు తేడా లేకుండా టీ, కాఫీలు ఎప్పుడు పడితే అప్పుడు తాగుతూనే ఉంటారు. సరైన సమయంలో ఆహారం తీసుకోకుండా టీ, కాఫీలు తాగడానికి ప్రాధాన్యతనిస్తారు. ఇక అటువంటి వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడం కచ్చితంగా జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

టీ, కాఫీలతో నిద్రాభంగం .. ఆపై అలసట, మానసిక అనారోగ్యం

టీ, కాఫీలతో నిద్రాభంగం .. ఆపై అలసట, మానసిక అనారోగ్యం


ఇక డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు టీ, కాఫీలు మానేస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. అంతేకాదు టీ సహజంగా కెఫిన్ ను కలిగి ఉన్నందున, అధికంగా తీసుకోవడం వల్ల మీ నిద్రకు అంతరాయం కలిగించవచ్చు. మెలటోనిన్ అనేది మీ మెదడుకు నిద్రపోయే సమయం అని సూచించే హార్మోన్. కెఫిన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఫలితంగా నిద్ర నాణ్యత తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సరిపోని నిద్ర అలసట, బలహీనమైన జ్ఞాపకశక్తి మరియు తగ్గిన శ్రద్ధతో సహా అనేక రకాల మానసిక సమస్యలకు కారణంగా మారుతుందని చెబుతున్నారు.

 ఊబకాయానికి కారణం అవుతున్న టీ, కాఫీలు

ఊబకాయానికి కారణం అవుతున్న టీ, కాఫీలు

ఇంకా దీర్ఘకాలిక నిద్ర లేమి ఊబకాయం మరియు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి డయాబెటిస్ బారిన పడేలా చేస్తుందని చెబుతున్నారు. టీ లేదా కాఫీ ద్వారా కెఫిన్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి కలుగుతుందని చెబుతున్నారు. ఒక కప్పు టీలో దాదాపు 11 నుండి 61 మిల్లీగ్రాముల కెఫిన్‌ వుంటుందని చెబుతున్నారు. ఇక నిద్రపోయేముందు టీ, కాఫీలు మానుకోవాలని సూచిస్తున్నారు.
కాఫీ, టీ తాగాలనుకుంటే సాయంత్రం సమయంలో స్నాక్స్ తో పాటు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అంతేకాదు వర్కౌట్ లకు ముందు కాఫీ తాగడం కూడా మంచిదని చెప్తున్నారు. అలా అని పొద్దున్నే నిద్ర లేవగానే పరగడుపున కాఫీలు, టీలు తాగడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Health experts warn if yoy drink coffees and tea with an empty stomach in the morning, you will get sick. doctors suggested it is not good to anybody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X