వాస్తు ప్రకారం వంటగదిలో చేయాల్సిన మార్పులు ఇవే.. ఒకసారి చూసుకోండి
వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించినా అందులో నిర్మించిన ప్రతి గదికి వాస్తు ఉంటుంది. ఆ ప్రకారం వాస్తు అనుసరిస్తే అన్నిరకాలు ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రధానంగా వంటగదిపై వాస్తు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్ని గదుల కంటే. అందుకే ఈ గదిలో వాస్తు ఎలా ఉండాలి? ఎటువంటి మార్పులు చేయాలి? వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరించాల్సిన నియమాలేంటి? అనే విషయాలను తెలుసుకుందాం.
వంటగదిలో అగ్ని ఉంటుంది.
అందుకే వంటగది నైరుతి, ఈశాన్యంలో ఉండకూడదు.
ఈశాన్యంలో, బాత్ రూం సమీపంలో వంటగది నిర్మించకూడదు.
ఆగ్నేయ మూలలో ఎప్పుడూ గ్యాస్ ఉంచాలి.
గ్యాస్ ఎవెన్యూ దక్షిణ ముఖంగా ఉండాలి.

వంట చేసేవారు తూర్పు వైపు నిలబడాలి.
తూర్పు కుదరకపోతే పడమరవైపు నిలబడాలి.
ఉత్తరం, దక్షిణం వైపు వంట చేయకూడదు.
స్టవ్, సింక్ పక్కపక్కనే ఎప్పుడూ ఉండకూడదు.
నీరు వచ్చే సింక్ ఈశాన్యం దిశగా ఉండాలి.
వంటగదికి చాక్లెట్, పసుపు, ఆరెంజ్, ఎరుపు రంగులే వాడాలి.
నిత్యాసరాలను నిల్వ చేసే డబ్బాలను నైరుతి లేదంటే పశ్చిమవైపు ఉంచాలి.
తెలుగు, పసుపు పాస్టెల్ షేడ్స్ వంటగదికి బాగుంటాయి.
ఈ రంగులు సానుకూల శక్తిని ప్రసరింపచేస్తాయి.
కుటుంబ సభ్యల్లో సంతోషాన్ని నింపుతాయి.
గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు తెరిచి ఉంచాలి.
దీనివల్ల ఆరోగ్యంతోపాటు సానుకూల శక్తి వస్తుంది.
గాలి, వెలుతురు బాగా రావడంవల్ల ఆరోగ్యంతో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా కలుగుతుంది.
ఒకవేళ వంటగదిని పునర్నిర్మించాలనుకుంటే వాస్తు నిపుణుల సలహా తీసుకోవాలి.












Click it and Unblock the Notifications