అక్టోబరు నెల మొత్తం రాశి ఫలాలు: వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతాయి

అక్టోబర్ 2026 నెలలో గ్రహాల గమనం ఆధారంగా 12 రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. నెల మొత్తం వారికి ఏవిధంగా కలిసిరానుందనే వివరాలను కూడా చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ నెలలో మీరు తలపెట్టిన పనుల్లో మంచి పురోగతి ఉంటుంది. విదేశాల నుంచి ఉద్యోగ, ఉపాధికి సంబంధించి శుభవార్తలు అందుకుంటారు. అయితే నెల ప్రారంభంలో ఆరోగ్యంపై, కుటుంబ వాతావరణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు, నిరుద్యోగులకు కాలం అనుకూలంగా ఉంది.

మొత్తం 12 రాశుల్లో అక్టోబరు నెల 'కింగ్స్’ తులా రాశి, ధనుస్సు రాశి
మొత్తం 12 రాశుల్లో అక్టోబరు నెల 'కింగ్స్’ తులా రాశి, ధనుస్సు రాశి
Horoscope for the entire month of October Businesses will flourish steadily

వృషభ రాశి (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అయితే అకారణ ఖర్చులు పెరిగే సూచనలున్నందున ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

మిథున రాశి (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఓపికతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అయితే విలాసాల కోసం అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ నియంత్రణ అవసరం.

Horoscope: తులారాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి అక్టోబరు నెల సమగ్ర జాతక ఫలం
Horoscope: తులారాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి అక్టోబరు నెల సమగ్ర జాతక ఫలం

కర్కాటక రాశి (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఈ రాశిలో 'హంస రాజయోగం' ఏర్పడటం వల్ల ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కెరీర్‌లో అద్భుతమైన పురోగతితో పాటు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1)

నెల ప్రారంభంలో పనులు పూర్తి కావడానికి కాస్త శ్రమించాల్సి వస్తుంది. అష్టమ శని ప్రభావం వల్ల చిన్నపాటి అడ్డంకులు ఎదురైనా, మీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. విద్యారంగం వారికి, టెక్నికల్ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.

కన్యా రాశి (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

గురు, శుక్ర, బుధుల అనుకూలత కారణంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ మృదువైన మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఖర్చులపై కొద్దిగా నిఘా ఉంచడం మంచిది.

తులా రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ నెల మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఊహించని విజయాలు, ఉన్నత స్థాయి గుర్తింపు లభిస్తాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీలు మంచి లాభాలను ఇస్తాయి. కుటుంబంలో గతంలో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, మనోధైర్యం పెరుగుతుంది.

వృశ్చిక రాశి (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థికంగా ఈ నెల మీకు తిరుగుండదు. ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు ప్రభావంతో ఆదాయం పెరుగుతుంది, పాత సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కోర్టు కేసులు లేదా ఆస్తి వివాదాలలో విజయం సాధించే సూచనలున్నాయి.

ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

లాభ స్థానంలో గ్రహాల సంచారం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి, ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా మారుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు బలపడతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఈ నెల మీకు చాలా సానుకూలంగా ఉంటుంది. తృతీయ శని, సప్తమ గురుబలం వల్ల ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతాయి. కుటుంబ సమేతంగా దైవదర్శనాలు చేసుకుంటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఏలిన్నాటి శని ప్రభావం ఉన్నప్పటికీ, ఈ నెలంతా సాఫీగా, ప్రశాంతంగా గడిచిపోతుంది. భాగ్య స్థానంలో శుభగ్రహాల సంచారం వల్ల అనుకోని శుభవర్తాలు వింటారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ, మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పిల్లల చదువుల పట్ల శుభవార్తలు వింటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+