సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్.. బీజేపీతో పొత్తుపై స్ట్రాంగ్ స్టేట్మెంట్

తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తిస్థాయిలో తెరదించారు. బీజేపీతో తమ పార్టీ జతకడుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కేరళలోని కొచ్చి వేదికగా జరిగిన ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ సదస్సులో పాల్గొన్న కేటీఆర్.. రాజకీయ పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 26 ఏళ్ల పార్టీ చరిత్రలో బీజేపీతో ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదని, భవిష్యత్తులో కూడా ఆ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కొందరు ఇటువంటి నిరాధారమైన ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చినంత మాత్రాన తమ సిద్ధాంతాలు, డీఎన్ఏ ఎప్పటికీ మారవని కేటీఆర్ స్పష్టం చేశారు. కేవలం తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి నమూనాను దేశవ్యాప్తంగా విస్తరించేందుకే జాతీయ పార్టీగా మార్పు చేశామని తెలిపారు. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై స్పందిస్తూ.. తాను సీఎం రేసులో లేనని, కేసీఆర్ నాయకత్వంలోనే తాము తదుపరి ఎన్నికలకు వెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చవిచూసినప్పటికీ, ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఆదరణ మరింత పెరిగిందని చెప్పారు. గతంలో కంటే రెట్టింపు శక్తితో తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

KTR Rules Out BRS-BJP Alliance Declares KCR as Chief Ministerial Face for Next Telangana Polls

కాంగ్రెస్ పాలనపై ప్రజా వ్యతిరేకత..

తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలైందని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వందలాది హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తిరుగుబాటు బావుటా ఎగరవేసే పరిస్థితి వచ్చిందని అభివర్ణించారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి, ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో ఇక్కడి పాలన సాగుతోందని ఆయన దుయ్యబట్టారు.

జగన్‌కు భట్టి ఆత్మీయ ఆహ్వానం.. కాంగ్రెస్‌లోకి వచ్చేయండి
జగన్‌కు భట్టి ఆత్మీయ ఆహ్వానం.. కాంగ్రెస్‌లోకి వచ్చేయండి

పార్లమెంటరీ నియోజకవర్గాల డీలిమిటేషన్ పై కేటీఆర్ హెచ్చరిక

డీలిమిటేషన్ ప్రక్రియపై కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు ఈ విధానం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. కేవలం లోక్‌సభ స్థణాలను పెంచడం కంటే, ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండే శాసనసభ స్థానాలను ఎందుకు పెంచడం లేదని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.

సీఎం పోస్టుపై ఆశ లేదా ? లోకేష్ జవాబు ఇదే..! డీఎస్సీపై వైసీపీకి కౌంటర్..!
సీఎం పోస్టుపై ఆశ లేదా ? లోకేష్ జవాబు ఇదే..! డీఎస్సీపై వైసీపీకి కౌంటర్..!

ఓటర్ల జాబితా సవరణపై అనుమానాలు.. కోర్టుకెళ్తాం

ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను తాము స్వాగతిస్తున్నప్పటికీ, దానిని అమలు చేస్తున్న తీరుపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించిన నియోజకవర్గాల్లోనే అత్యధికంగా ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున, ఈ అక్రమాలపై స్వతంత్ర విచారణ కోరుతూ తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘంపై ప్రజలకు నమ్మకం సడలకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+