తల్లికి వందనం పెండింగ్ నిధుల జమ పై బిగ్ అప్డేట్..!!

తల్లికి వందనం రెండో విదత లబ్ది దారులకు ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే తల్లికి వందనం ఈ సంవత్సరం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, కొత్తగా పాఠశాలలు.. కాలేజీల్లో చేరిన వారికి నిధులు విడుదల కాలేదు. అదే విధంగా అర్హత ఉండీ అందని వారికి సైతం మరో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల జాబితాలను సిద్దం చేసారు. వీరికి నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది.

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ ఏడాది వరుసగా రెండో సారి నిధులను ప్రభుత్వం ఇప్పటికే అర్హులైన లబ్ది దారుల ఖాతాల్లో జమ చేసింది. అయితే, కొత్తగా బడులు.. కాలేజీల్లో చేరిన వారికి నిధుల జమ కోసం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిధుల జమ వేళ అర్హత ఉండీ.. అందని వారికి ఇప్పుడు నిధులు జమ చేయనున్నారు. వీరితో పాటుగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థులకు కూడా పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది పథకం అమల్లో భాగంగా జూలై 22న 64.76లక్షల మంది విద్యార్థులకు సంబంధించి నిధులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఒకటో తరగతి అడ్మిషన్లు, ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు, రికార్డులు సరిదిద్దాల్సినవి కలిపి మరో 2.7లక్షల మంది ఉంటారని అప్పట్లో ప్రభుత్వం అంచనా వేసింది.

 స్థానిక ఎన్నికల వేళ పవన్ బిగ్ డెసిషన్ - నో కాంప్రమైజ్..!!
స్థానిక ఎన్నికల వేళ పవన్ బిగ్ డెసిషన్ - నో కాంప్రమైజ్..!!
ap-govt-to-release-pending-thalliki-vandanam-funds-for-3-lakh-beneficiaries-soon-here-the-details

ప్రభుత్వం తుది జాబితాకు ఆమోదం

తొలుత వీరందరికీ రెండో విడత ఆగస్టు 30న నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ షెడ్యూలు ప్రకారం నిధులు విడుదల కాలేదు. దీంతో సుమారు 3లక్షల మంది తల్లికి వందనం రెండో విడత నగదు కోసం ఎదురుచూస్తున్నారు. పథకం అర్హత ఉండీ రాని వారి నుంచి అభ్యంతరాలు.. దరఖాస్తులు స్వీకరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హత ఉండి డబ్బులు పడనివారిని గుర్తించారు. లబ్ది దారుల జాబితాల ను ప్రదర్శించారు. కాగా, ఈ నిధులకు సంబంధించిన ఫైలుకు ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. తుది ఆమోదం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైలు పంపారు. అక్కడ ఆమోదం లభిస్తే త్వరలోనే నగదు విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా, ఒక్కో విద్యార్థికి రూ.13వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. రెండో విడత కూడా కలిపితే దాదాపు 68లక్షల మందికి విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+