IND vs SL: ఇషాన్ కిషన్ విధ్వంసం.. లంక ముందు గట్టి సవాల్!
IND vs SL: జపాన్‌లో నిషిన్ నగరంలోని కొరోగి స్పోర్ట్స్ పార్క్ స్టేడియం వేదికగా శ్రీలంక జట్టుతో జరుగుతున్న ఆసియా క్రీడల సెమీ-ఫైనల్ మ్యాచ్ లో భారత్ అద్భుతంగా రాణించింది. క్లిష్టమైన పిచ్ పై భారత్ అద్భుతంగా పోరాడి భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 170 పరుగు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆరంభంలోనే అద్భుతమైన ప్రారంభం లభించింది. మొదటి 3 ఓవర్లలోనే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లను వరుసగా పెవిలియన్ పంపి టీమిండియాను దెబ్బతీసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత్ తడబడుతున్న సమయంలో యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ భయపడకుండా కౌంటర్ ఎటాక్ ప్రారంభించాడు. కేవలం 21 బంతుల్లో 38 పరుగులు సాధించి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. వైభవ్ సూర్యవంశీ దాడితో భారత్ పవర్‌ప్లే ముగిసేసరికి 58/2 స్కోరుతో బలమైన స్థితిలో నిలిచింది.

మిడిల్ ఓవర్లలో లంక స్పిన్ ఉచ్చు
అయితే మిడిల్ ఓవర్లలో శ్రీలంక స్పిన్నర్లు మ్యాచ్ ను మళ్లీ తమ వైవు తిప్పుకున్నారు. సహన్ అరచ్చిగే బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ ఔట్ కాగా.. వనుజ సహన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లంక స్పిన్నర్లు పకడ్బందీ బౌలింగ్‌తో రన్ రేట్‌ను కట్టడి చేస్తూ వరుస వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, తిలక్ వర్మ, శివమ్ దూబే తక్కువ స్కోర్లకే నిష్క్రమించడంతో భారత్ ఒకానొక దశలో 151/7తో కష్టాల్లో పడింది.
ఇషాన్ కిషన్ విధ్వంసం
ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ ఇషాన్ కిషన్ ఒంటరి పోరాటం చేస్తూ ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఆరంభంలో నిలకడగా ఆడిన ఇషాన్ కిషన్.. డెత్ ఓవర్లలో చెలరేగిపోయి 46 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. చివరిలో వాషింగ్టన్ సుందర్ మెరుపు కామియో జోడించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. శ్రీలంక ఫైనల్ టికెట్ ఖాయం చేసుకోవాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండటంతో ఈ ఛేజింగ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగనుంది.













Click it and Unblock the Notifications
