మిథున రాశి, కర్కాటక రాశి ఆగస్టు నెల పూర్తి జాతక ఫలం వివరాలు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలు ఏర్పడుతుంటాయి. కొన్ని రాశులకు కలిసివస్తుంది. మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇంకొన్ని రాశులవారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖగోళంలో గ్రహాల కలయికతో ఈ పరిణామాలు ఏర్పడుతుంటాయి. అలాగే ఆగస్టు నెలకు సంబంధించి మిథున రాశి, కర్కాటక రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
1. మిథున రాశి
మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఆగస్టు 2026 నెల చాలా అనుకూలంగా, ప్రయోజనకరంగా ఉండబోతోంది. వృత్తి రీత్యా స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఆఫీసులో మీ పనికి తగిన గుర్తింపు లభించి, ప్రశంసలు అందుకంటారు. ధన యోగం స్పష్టంగా కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, దీర్ఘకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది.

ధనాన్ని ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అవివాహితులకు వివాహ నిశ్చయం జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పారాయణ చేయడం లేదా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మరింత మేలు చేస్తుంది.
2. కర్కాటక రాశి
పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఆగస్టు 2026 నెలలో గ్రహాల మార్పుల వల్ల మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒత్తిడికి లోనుకాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తిపరంగా పనిభారం పెరుగుతుంది. సహోద్యోగులతో లేదా అధికారులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు, కాబట్టి మాట తీరుపై నియంత్రణ అవసరం. రాబడికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు, అకస్మాత్తుగా వచ్చే ఖర్చుల వల్ల ధన ఇబ్బందులు తలెత్తవచ్చు. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్త వహించండి.
కుటుంబంలో చిన్నచిన్న మనస్పర్థలు రావచ్చు. భావోద్వేగాలకు గురికాకుండా ఓపికగా చర్చించుకోవడం మంచిది. శారీరక అలసట, ఒత్తిడి ఉండవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, విశ్రాంతి పొందేలా చూసుకోవడం శ్రేయస్కరం. ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయడం లేదా ఓం నమః శివాయ జపం చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గి శాంతి లభిస్తుంది.












Click it and Unblock the Notifications