శని త్రయోదశినాడు ఇలా చేస్తే సంపదలను, శుభాలను ఆశీర్వదించే శనిదేవుడు!
శని దేవుడు ఈయనను కర్మదేవుడిగాను, క్రమశిక్షణ నేర్పే దేవుడిగాను,కఠినమైన న్యాయదేవతగాను అందరూ భావిస్తారు. శని దేవుడు జాతకంలో మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితాలను, చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలను ఇస్తాడు. మనం చేసే కర్మలకు ఫలితాలను ఇచ్చే భగవానుడే శని భగవానుడు. శని అనుగ్రహమైనా, ఆగ్రహం అయినా చాలా తీవ్రంగా ఉంటుంది. శని అనుగ్రహిస్తే సంపదలకు కొదవ ఉండదు. శని ఆగ్రహిస్తే అన్ని రకాల దరిద్రాలు పట్టిపీడిస్తాయి.
శని త్రయోదశి సమయం ఇదే
అటువంటి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది అదే శని త్రయోదశి. ఆగస్టు 31 2024న శని త్రయోదశి ఉదయం రెండు గంటల 25 నిమిషాలకు ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉదయం 3:41 నిమిషాలకు ముగుస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో శని త్రయోదశి కి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది.

శని దేవుడికి ఇష్టమైన శని త్రయోదశి
శని త్రయోదశి నాడు శని భగవానుడిని శాంతింపజేసే పూజలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందని, అనేక సమస్యల నుంచి మనకు ఉపశమనం లభిస్తుందని చెబుతారు. శని త్రయోదశి శివుడికి ఇష్టమైన రోజు .శనివారం విష్ణువుకు, త్రయోదశి పరమశివునికి ఇష్టమైన రోజు కాబట్టి శని త్రయోదశి రోజు శివకేశవులతో పాటు శని భగవానుడిని కూడా పూజిస్తారు.
ఇలా శని పూజ చెయ్యాలి
ఎవరైతే జాతకంలో శని ప్రతికూల ప్రభావాలతో ఇబ్బంది పడుతున్నారో వారు శని త్రయోదశి నాడు నియమ నిష్ఠలతో శనిపూజ చేస్తే శని దేవుడు ప్రసన్నమవుతాడు. శని త్రయోదశి పండుగ నాడు శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఉదయానే తలస్నానం చేసే శరీరాన్ని మనసును శుద్ధి చేసుకోవాలి. శని దేవునికి ఇష్టమైన నల్లని రంగు దుస్తులు ధరించి, పడమర ముఖంగా కూర్చొని నల్ల నువ్వులతో నీటితో విఘ్నేశ్వరుడికి, శని భగవానుడికి పూజలు చేయాలి.
శని త్రయోదశి నాడు ఇలా చేస్తే మంచిది
నువ్వుల నూనెతో దీపారాధన చేసి శని మంత్రాన్ని జపించి, పేదలకు నల్లని నువ్వులు, నల్లని వస్త్రాలు లేదా ఇనుప వస్తువులను దానం చేయాలి. ఆపై హారతి ఇచ్చి శనిదేవుని అనుగ్రహం పొందాలి. ఇలా నిష్ఠతో ఎవరైతే శని దేవుని పూజిస్తారో వారికి ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. కాబట్టి శని భగవానుడి దయ కావాలని భావించేవారు నియమనిష్ఠలతో శని దేవుడి పూజ చేయాలి.
ఆలయానికి వెళ్లి అయినా శని పూజ చేస్తే మంచిది
ఇంట్లో శని దేవుని పూజించుకోవడం సాధ్యం కాకపోతే నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్లి ఆలయంలో శని దేవుడికి నువ్వుల నూనె, నల్లటి వస్త్రాన్ని సమర్పించి నల్ల నువ్వుల నూనె నైవేద్యంగా పెట్టి ప్రార్థించాలి. ఇలా ఎవరైతే శని త్రయోదశి నాడు శని దేవుని పూజిస్తారో వారికి అన్ని శుభాలే జరుగుతాయి. శని దేవుడి కటాక్షంతో వారికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications