వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ్యోతిషం: కృత్తిక నక్షత్రంలో జన్మిస్తే

By Pratap
|
Google Oneindia TeluguNews

మొదటిపాదం మేషరాశిలోనూ, 2, 3, 4 పాదాలు వృశభరాశిలో ఉంటాయి. మేషానికి కుజుడు, వృషభానికి శుక్రుడు అధిపతులు. కృత్తిక మొదటి పాదంలో పుట్టినవారు: గరు నవాంశ కనుక శాస్త్ర విజ్ఞానం, నైపుణ్యం, న్యాయ చింతన, ధర్మశీలం, రోషపౌరుషాలుంటాయి.

రెండవ పాదంలో పుట్టినవారు: మకర శని నవాంశలో పుట్టిన వారికి లౌక్యం, స్వార్థం, నెమ్మది, కార్యసాధన దృష్టి, దుష్టసహవాసం, స్త్రీల ఆకర్షణ ఉంటాయి. మూడవ పాదంలో పుట్టినవారు: కుంభ నవాంశలో జన్మించిన వారికి తీవ్రకోపం, దుస్సాహసం, లోభం, మందబుద్ధి, జనాకర్షణ, ప్రయోజన దృష్టి ఉంటాయి.

నాల్గవ పాదంలో పుట్టినవారు: గురు నవాంశలో జన్మించిన వారికి మంచి విద్య, వినయ విధేయతలు, ధర్మగుణం, దైవభక్తి, న్యాయప్రవర్తన, దానశీలం, పరోపకారం, తెలివితేటలు, శాస్త్ర విజ్ఞానం ఉంటాయి.

If your Nakshatra is Krithika...

రోహిణి నక్షత్రంలో జన్మిస్తే:

ఇది నక్షత్రాలలో 4వ నక్షత్రం. రోహిణి నక్షత్రం వృషభరాశిలో ఉంటుంది. జన్మరాశికి అధిపతి శుక్రుడు. రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు. రోహిణి మొదటి పాదంలో పుట్టినవారు: మేష, కుజ నవారశలో జన్మించిన వారికి రోషచిత్తం, ఎరువు ఛాయ, ఎరుపు శిరోజాలు ఉంటాయి. నిష్ఠూరంగా మాట్లాడతారు. ధైర్యసాహసాలు అధికం.

రెండవ పాదంలో పుట్టిన వారు: భృత్యాంశలో జన్మిస్తే విశాలమైన శరీరం, మంచి ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహం, బంధుప్రేమ, మృష్టాన్న యోగం ఉంటాయి. ఉద్యోగాలలో అభివృద్ధికి వస్తారు. కోపాన్ని అణుచుకోగలరు. మూడవ పాదంలో పుట్టినవారు: మిథున, బుధ విద్వదంశలో జన్మిస్తే కవులు, పండితులు, గణిత శాస్త్ర నిపుణులు, విద్వాంసులు, కాళాకోవిదులు అవుతారు.

ధర్మవర్తన, మంచి గుణాలు, ప్రపంచజ్ఞానం, విచక్షణ, చతురత, యుక్తి ఉంటాయి. నటులు, గాయకులు, చిత్రకారులు అవుతారు. నాల్గవ పాదంలో పుట్టినవారు: కర్కాటక నవాంశ అంత్యాంశ. వ్యాపార నైపుణ్యం, చక్కని రూపం, జనాకర్షణ, స్నేహ శీలం, మాటనేర్పు, తెలివితేటలు, జనరంజకత్వం ఉంటాయి. పరద్రవ్యాన్ని ఆకర్షించగలరు. సంపన్నులు కాగలరు.

రోహిణి నక్షత్ర జాతకులకు ఆకర్షణీయమైన రూపం. కార్య నైపుణ్యం, మాటల్లో నేర్పు, కలుపుగోలుతనం, స్థిరమైన నుదురు చిన్నదిగా ఉంటుంది. కంటి జబ్బులకు లోనవుతారు.

English summary
Astrologer gives the characteristics of the persons of Bharani Nakshatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X