వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25 వ తేదీ సాయంత్రం నుంచి షష్టగ్రహ కూటమి ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

|
Google Oneindia TeluguNews

డిసెంబర్ నెల 25 వ తేది సాయంత్రం 4:41 నుండి 27 వ తేది రాత్రి 11:40 వరకు ఈ షష్టగ్రహ కూటమి ఉంటుంది. గురు ,శని ,కేతు ,బుధ , రవి ,చంద్ర గ్రహాలు ధనస్సు రాశిలో కలుస్తున్నాయి. ఈ కలయిక వలన గ్రహ స్థానాలను బట్టి ఆయా రాశుల వారికి శుభ , అశుభ , మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ ఫలితాల ప్రభావం ఈ నెల 15 వ తేదీ నుండి వచ్చె నెల అంటే తేదీ 26 జనవరి 2020 వరకు ఉంటుంది. ఎలాంటి ఫలితాలు ఉన్నపటికీ ఆందోళన పడవలసిన పనిలేదు. ముందుగానే మనకు గ్రహ ప్రభావాలు తెలుస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని దైవారాధన చేయండి.

మేషరాశి :- 9 వ స్థానం లో గ్రహ కూటమి. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొత్తగా ఆలోచనలు చేయకండి , వ్యవహారంలో మార్పులు జరుగుతాయి , సహనంతో ఉండండి, ఇష్టదేవత ఆరాధన చేయండి . ఆవునకు అరటిపండ్లు దానాగా ఇవ్వండి.

వృషభం :- 8 వ స్థానంలో గ్రహకూటమి. అశుభ స్థానం , ప్రయాణాలు చేయకండి , ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి, ధన నష్టం , దుర్గాదేవిని ఆరాధించండి . ఆవునకు తోటకూర ,క్యారెట్ ,బెల్లం దానా వేయండి.

Impact of Shashta Graha Kotami and Its remedies

మిధునరాశి :- 7 వ స్థానంలో గ్రహకూటమి. సామాన్య ఫలితాలు, చికాకు, వైరాగ్యం కలుగుతుంది, ఆందోళనలు, వ్యాపారం జాగ్రత్తగా చూసుకోండి, పుణ్యక్షేత్ర యాత్ర చేయండి, ఆవునకు నానబెట్టిన కేజింపావు పేసర్లు,బెల్లం దానం చేయండి .

కర్కాటకరాశి :- 6 వ స్థానంలో గ్రహకూటమి. శుభస్థానం , ఆర్థిక లాభం , సుఖం , బంధుకలహం ఉంటుంది , బియ్యం,బెల్లం ఆవుకు దానం చేయండి .

సింహ రాశి :- 5 వ స్థానంలో గ్రహకూటమి. ప్రతికూలము, శత్రుపీడ, అనారోగ్యం, నిందలు, మినుములు, గోధుమలు, బెల్లం కలిపి గోమాతకు దాన ఇవ్వండి, ఇష్ట దేవతారాధన చేయండి .

కన్యారాశి :- 4 వ స్థానంలో గ్రహ కూటమి. ప్రతికూలము, ఆర్థిక ఇబ్బంది, మానసిక, ఆర్థిక, శారీరక ఇబ్బంది , సామాన్య జీవితం గడపండి, హనుమాన్ చాలీసా చదవండి. కోతులకు లేదా గోమాతకు కేజింపావు నానబెట్టిన శనగలకు బెల్లం పట్టించి ఆహారంగా ఇవ్వండి.

తులారాశి :- 3 వ స్థానంలో గ్రహకూటమి. శుభం , ఆగిన పనులు జరుగుతాయి, కీర్తి , వస్తు , ధనప్రాప్తి , లక్ష్మిదేవిని పూజించండి. క్యారెట్టు ,బెల్లం ఆవునకు పెట్టండి.

వృశ్చికరాశి :- 2 వ స్థానంలో గ్రహకూటమి. ప్రతికూలం , కలహం , అప్పుల బాధ , కంటి సమస్య , అధిక ఖర్చు , కాలభైరవ పూజ చేయండి. ఆవునకు నువ్వులు ,బెల్లం పెట్టండి

ధనస్సురాశి :- 1 వ స్థానంలో గ్రహకూటమి. ప్రతికూలం , శ్రమ అధికం , ఆర్థిక, మానసిక ,శారీరక ఇబ్బంది , నవగ్రహ స్తోత్రం , మృత్యుంజయ స్తోత్రం చదవండి. ఆవుకు తోటకూర ,కీరా ,టమోటాలు పెట్టండి.

మకరరాశి :- 12 వ స్థానంలో గ్రహకూటమి. వ్యయ స్థానము, ప్రతికూలము , బంధుకలహం, ఇష్టం లేని వ్యవహార భారం, హనుమాన్ చాలీసా చదవండి. కాకులకు నువ్వులు,బెల్లం వేసిన చపాతీలు నువ్వుల నూనెతో రొట్టెలు కాల్చి వాటిని సన్న ముక్కలుగా కట్ చేసి కాకులకు వేయండి.

కుంభరాశి :- 11 వ స్థానంలో గ్రహకూటమి. శుభం , లాభస్థానం , విశేషయోగం , శివారాధన చేయండి. ఆవుకు నువ్వులు,బెల్లం నానబెట్టిన ఉలవలు ఆహారంగా ఇవ్వండి.

మీనరాశి :- 10 వ స్థానంలో గ్రహకూటమి. కర్మ స్థానం , మిశ్రమ ఫలితాలు , శ్రమ అధికం , చికాకు , కోపం కలుగుతుంది, ఆందోళన. దత్తాత్రేయ ఆరాధన చేయండి. ఆవుకు గోధుమలు ,బెల్లం ,తోటకూర ఆహారంగా ఇవ్వండి.

శుభ ఫలితాలు :- కర్కాటక , తులా , కుంభ రాశులు.

మిశ్రమ ఫలితాలు : - మేష , మిధున , సింహ , మీన రాశులు.

అశుభ ఫలితాలు : - వృషభ , కన్య , వృశ్చిక , ధనస్సు , మకరరాశులు.

కొంతవరకు ఈ గ్రహకూటమి వలన ఎక్కువగా ఇబ్బందులు మాత్రం పడవలసి వచ్చినప్పటికీ
నిత్యమూ దైవ దర్శనం , దైవ ప్రార్థన చేస్తూ ఓపికగా ఉంటూ ( యోగా ) ధ్యానం చేస్తూ, మాట పట్టింపులకు పోకుండా సహనం పాటిస్తూ, సత్ప్రవర్తనతో మెలిగితే శుభాలను పొందగలరు జై శ్రీమన్నారాయణ.

English summary
Impact of Shashta Graha Kotami and Its remedies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X