గ్యాస్ సిలిండర్ల రేట్లు మళ్లీ పెంపు?
మే నెలకు ఇది చివరి రోజు. రేపటి నుండి అనేక కీలక ఆర్థిక మార్పులతో జూన్ నెల ప్రారంభం కానుంది. వీటి ప్రభావం ప్రతి ఇంటి బడ్జెట్‌పైనా పడొచ్చు. ప్రత్యేకించి- ఎల్పీజీ వంటగ్యాస్ ధరల్లో సవరణలు దాదాపుగా ఖాయం అయ్యాయి. ప్రతి నెలా ఒకటో తేదీన వీటిని సవరించడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. దీన్ని జూన్ 1వ తేదీన కూడా కొనసాగించే అవకాశాలు లేకపోలేదు.
మే 1న వంటగ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు పెరిగాయి ఆ రోజున. ఒక్కో సిలిండర్‌పై ఏకంగా 993 రూపాయలు పెరిగింది. వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు అమాంతం దాదాపు రూ. 1,000 వరకు పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పెంపు.. ఈ పెంపు హోటళ్లు, రెస్టారెంట్లను నడిపే వారిలో ఆందోళన నింపింది. ఇదే పరిస్థితి జూన్ 1వ తేదీన కూడా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూ వస్తోన్నాయి. 15 రోజుల వ్యవధిలో ఇప్పటికే వీటి రేట్లు రూ. 7.50 పైసల వరకు ఎగబాకాయి. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరలు సైతం వీటికి తోడవుతున్నాయి. రేటు విషయంలో ఈ మూడింటి మధ్య పెద్ద తేడా ఉండట్లేదు. ఇక ముందు పెరగకపోవచ్చనే గ్యారంటీ లేదు. జూన్ 1వ తేదీ నుంచి మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్ల ధరలు మళ్లీ పెరగొచ్చనే వాదనలు లేకపోలేదు.
పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పై ఎగుమతి సుంకాలను మరింత తగ్గించింది కేంద్రం. 15 రోజుల పాటు అంటే.. జూన్ 1 నుండి 15 వరకు ఈ తగ్గుదల కొనసాగుతుంది. అంతర్జాతీయ ఇంధన ధరల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి 15 రోజులకోసారి నిర్వహించే సమీక్ష సందర్భంగా పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ డ్యూటీని సవరించింది. దీన్ని బట్టి చూస్తే ఇంధనం, వంటగ్యాస్ సిలిండర్ల ధరలను కూడా సవరించడం ఖాయమైనట్టే.
అలాగే పీఎన్జీ కనెక్షన్లు ఉన్నవారు ఎల్పీజీని రద్దు చేయాల్సి ఉంటుంది జూన్ 1వ తేదీ నుంచి. లేకపోతే సిలిండర్ కనెక్షన్ రద్దయ్యే ప్రమాదం ఉంది. పీఎన్జీ కనెక్షన్ తీసుకుని కూడా ఎల్పీజీని రద్దు చేయని ఇళ్లను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే దేశవ్యాప్తంగా మొదలైంది. డబుల్ కనెక్షన్ ఉన్న ఇళ్లను ఏరివేయడాన్ని గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది చేపట్టారు. దీనికి ప్రకారం.. ఈ రెండు కనెక్షన్లు ఉన్న వాళ్లు ఎల్పీజీని వదులుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications