ముంచుకొస్తున్న వినాశనం.. బాబా వంగా జ్యోతిష్య అంచనాలతో భయం!
బాబా వంగ... ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే సంఘటనలు చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ఫేమస్ గా గుర్తింపు పొందింది. బాబా వంగ ముందే ఊహించి చెప్పిన ఎన్నో ఘటనలు నిజమైన సందర్భాలు ఉన్నాయి. తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే చెప్పే బాబా వంగ ఫ్రెడ్డి మెర్క్యూరీ, ప్రిన్స్ డయానా చనిపోతారని ముందే చెప్పారు.
దాదాపు నిజమవుతున్న బాబా వంగా జ్యోతిష్య అంచనాలు
2011లో సంభవించే కోబ్ భూకంపం గురించి, కరోనా మహమ్మారి గురించి, అమెరికా ట్విన్ టవర్స్ కూల్చి వేత, 9/11 ముంబై ఉగ్రదాడుల గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇక ఆమె ముందుగానే ఊహించి చెప్పిన అన్ని దాదాపుగా నిజమయ్యాయి. బాబా వంగ జ్యోతిష్య అంచనాలు 80 శాతం వరకు నిజమయ్యాయి. దీంతో బాబా చెప్పే అంచనాల పైన చాలామందికి గురి కుదిరింది.

2025లో విపత్తు రాబోతుందన్న బాబా వంగా
1966లో బాబా వంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పటికీ బాబా వంగా జ్యోతిష్య శాస్త్ర అంచనాలు నేటికి చాలామంది బలంగా నమ్ముతారు. చాలా వరకు ఆమె ప్రిడిక్షన్ నిజమైంది. బాబా వంగా తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే చెప్పారు. ఈ క్రమంలో 2025లో ఒక విపత్తు రాబోతుందని జోస్యం చెప్పారు. 2025 లో జపాన్ లో మెగా సునామీ వస్తుందని పేర్కొన్నారు.
బాబా వంగా కలలో మరుగుతున్న సముద్రం
బాబా వంగాకు కలలో జపాన్ దేశానికి దక్షిణం వైపు ఉన్న సముద్రం మరుగుతున్న కనిపించిందట. ఈ క్రమంలోనే 2025 సంవత్సరం జులై నెలలో జపాన్లో మెగా సునామీ వస్తుందని ఆమె జ్యోతిష్య అంచనాలో వెల్లడించారు. ఆ సునామీ ప్రభావం ఒక జపాన్ లో మాత్రమే కాకుండా ఆసియా దేశాలపైన కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఇక తన కలలో డ్రాగన్ లాంటి ఆకారాలు కనిపించాయని పేర్కొన్నారు.
బాబా వంగా అంచనాలలో వాస్తవం... జపాన్ కు హెచ్చరిక
అయితే ప్రస్తుతం జపాన్ అధికారులు బాబా ముందే జ్యోతిష్య అంచనాలో వాస్తవం ఉందని అంటున్నారు. కొన్ని రోజుల క్రితం చైనా జపాన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిందని, మెగా కేక్ వస్తుందని చెబుతున్నారని, వేలమంది చనిపోయే అవకాశం ఉన్నట్టుగా ప్రకటించింది అని కూడా అధికారులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం బాబా వంగ జ్యోతిష శాస్త్ర అంచనాలలో భాగంగా సునామీ రాబోతుంది అన్న ప్రక్కన పెద్ద విపత్తును సూచిస్తోంది.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications