ఏ ప్రమిదలలో దీపం పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది?

కార్తీక మాసంలో దీపారాధనకు చాలా విశిష్టమైన స్థానం ఉంటుంది. దీపారాధన అంటే శరీరాన్ని, మనసుని భగవంతునికి అర్పించి జ్ఞాన జ్యోతిని వెలిగించడం. దీపావళి పండుగ నుండి కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు దీపారాధన చేయడం ఈ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అయితే దీపారాధన చేసేటప్పుడు ఎటువంటి ప్రమిదలలో చేయాలి? ఏ రకం ప్రమిదలలో దీపారాధన చేస్తే ఏం ఫలితం వస్తుంది? వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

దీపారాధన చేయడానికి మనం పూర్వం నుంచి ఇత్తడి ప్రమిదలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. దీపారాధనను ఇత్తడి ప్రమిదలలో చేస్తే బంగారు ప్రమిదలలో వెలిగించిన ఫలితం వస్తుందని చెబుతారు. అంతేకాదు ఆయుష్షు పెరుగుతుందని చెబుతారు. ఇక దీపారాధనను కంచు ప్రమిదలలో చేస్తే మంచిదని, కంచు ప్రమిదలలో దీపారాధన చేయడం వల్ల రోగాల బాధలు పోతాయని అకాల మృత్యువు దరిచేరకుండా ఉంటుందని చెబుతారు.

 Karthika deeparadhana: What kind of result will be obtained which type of lamps?

కంచు ప్రమిదలు స్టీలును పోలి ఉంటాయని చెబుతారు. పంచలోహాలతో తయారు చేసిన ప్రమిదలలో దీపారాధన చేస్తే ఆ కుటుంబానికి సుఖశాంతులు లభిస్తాయని చెబుతారు. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కంచు కలిపి చేసే ప్రమిదలను పంచలోహాలు ప్రమిదలు అంటారు. ఈ ప్రమిదలలో దీపారాధన చేయడం కూడా శ్రేయస్కరం.

ఆవు నెయ్యితో మట్టి ప్రమిదలలో దీపారాధన చేస్తే ఫలితం వస్తుందని చెబుతారు. బియ్యం పిండిలో కొద్దిగా పసుపు కలిపి ప్రమిదను చేసి కార్తీకమాసంలో శివాలయాలలో ఎక్కువగా దీపారాధన చేస్తారు .ఇక ఈ దీపారాధనతో కోరిన కోరికలు తీరుతాయని చెబుతారు. కార్తీకమాసంలో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో తులసికోట దగ్గర దీపారాధన చేస్తే నవగ్రహాల దోషాలు తొలగిపోతాయి.

తులసి చెట్టు వద్ద దీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. వెండి ప్రమిదలలో కొంతమంది దీపారాధన చేస్తారు. వెండి ప్రమిదలలో దీపారాధన చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని చెబుతారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+