వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్తీక మాసంలో కార్తీక స్నానానికి ప్రత్యేకత.. అద్భుతమైన ఫలితాలు తెలిస్తే మీరు ఆచరిస్తారు!!

|
Google Oneindia TeluguNews

తెలుగు పంచాంగంలో కార్తీక మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. కార్తీక మాసం శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కావటంతో ఈ మాసంలో ఎవరైతే శివుడిని, విష్ణువుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్తారు. ఇక కార్తీక మాసం నెల రోజులూ రోజూ ఉదయాన్నే స్నానం ఆచరించటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు. ఇక కార్తీక స్నానాలతో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం

.

 కార్తీక మాసంలో పవిత్ర స్నానం.. సకల పాప హరణం

కార్తీక మాసంలో పవిత్ర స్నానం.. సకల పాప హరణం


కార్తీక మాసంలో భక్తులు విశేషంగా పవిత్ర స్నానం చేస్తారు. చాలా మంది భక్తులు నదీ స్నానాలు చేసి శివ కేశవులను భక్తితో పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటైన కార్తీక మాసంలో భక్తులు శివునికి పత్రం-పుష్పం, ఫలం-తోయం సమర్పిస్తారు. చాలా మంది భక్తులు సమీపంలోని నదిలో పుణ్యస్నానాలు చేసి దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో నదీ స్నానాలు చెయ్యటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

కార్తీక స్నానం సమయంలో ఈ శ్లోకాన్ని చదివితే మంచి ఫలితం

కార్తీక స్నానం సమయంలో ఈ శ్లోకాన్ని చదివితే మంచి ఫలితం

ఇక కార్తీక స్నానం చేసే సమయంలో ఈ మంత్రాన్ని చదవడం వల్ల పాపాలు తొలగిపోవటం మాత్రమే కాక సకల సంపదలు చేకూరుతాయని చెప్తున్నారు. కార్తీక స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చదువుకోవాలి.
నమః కమలనాభాయ నమస్తే జలసాయినే |
నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే ||
కార్తికేహం కరిష్యామి ప్రాతః సన్నం జనార్దన |
ప్రీత్యర్థం తవ దేవేష్ దామోదర మహాశయ ||
ధ్యాత్వాహం తవం చ దేవేష్ జలేస్మిన్ స్నాతు ముద్యతః |
తవ ప్రసాదాత్ పాపం మే దామోదర విన్యస్యతు ||

పుణ్య క్షేత్రాల నుండి తెచ్చిన జలాలతో స్నానం చేసినా మంచి ఫలితం

పుణ్య క్షేత్రాల నుండి తెచ్చిన జలాలతో స్నానం చేసినా మంచి ఫలితం

కార్తీక మాసంలో పై శ్లోకాన్ని చదవలేని వారు ఓం నమో నారాయణాయ అంటూ అష్టాక్షరీ మంత్రాన్ని, ఓం నమశ్శివాయ అంటూ శివుడిని మనసులో తలుచుకుని స్నానం చేసినా అంతే ఫలితం ఉంటుంది. కార్తీక మాసంలో సూర్యోదయానికి ఒక గంట ముందు చేసే స్నానాన్ని కార్తీక స్నానం అంటారు. చాలా మంది ఈ నెలలో పుణ్య క్షేత్రాలకు వెళ్ళటం అసాధ్యం అనుకుంటే పుణ్య క్షేత్రాల నుండి తెచ్చిన జలాలను ఉపయోగించి స్నానం చేసినా అంతే ఫలితం ఉంటుంది.

మిగతా మతపరమైన స్నానాలకు కార్తీల స్నానాలకు తేడా ఇదే!!

మిగతా మతపరమైన స్నానాలకు కార్తీల స్నానాలకు తేడా ఇదే!!


ఏదైనా మతపరమైన పనుల నిమిత్తం స్నానాలు చేస్తే బాహ్య పాపాలు నశిస్తాయి. కానీ కార్తీక మాసంలో స్నానం చెయ్యటం వలన అంతర పాపాలు నశిస్తాయి. ఇక ప్రతీరోజు కార్తీక స్నానం చేసిన తర్వాత నుదుటిన తిలకం పెట్టుకోవాలి. ఆపై ఒక చెంబులో నీటిని తీసుకుని తూర్పుకు అభిముఖంగా నిలబడి భగవంతుని మనసులో ధ్యానం చేసుకుని తులసి మొక్కకు నీటిని పొయ్యాలి. ఇలా చేస్తే ఇంట్లోని సమస్యలు అన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. విష్ణు మూర్తి కటాక్షం లభిస్తుందని నమ్ముతారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Karthika snanam is special in the month of Karthika. It is said that bathing in Karthika month gives excellent results. Karthika baths are said to purify the body and mind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X