మకరరాశి ( Capricorn)వారికి 2022 - 2023 శ్రీ శుభకృత్ నామ సం. ర ఉగాది వార్షిక ఫలితాలు
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ప్రస్తుతకాల గోచార స్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు, యుతులు, పరివర్తనలు, గ్రహ అవస్తాలు.. మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఇందులో కేవలం సామూహిక ఫలితాలను మాత్రమే తెలియజేయడం జరుగుతున్నది. ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. సరైన పుట్టిన తేదీ, సమయం ఆధారంగా జాతక విశ్లేషణలో సరైన ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఆసక్తి కలవారు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. . డా.ఎం.ఎన్.ఆచార్య
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలవారు మకరరాశికి చెందుతారు.
మకరరాశి వారికి 'శుభకృత' నామ సంవత్సరంలో ఆదాయం - 5 , వ్యయం - 2
రాజపూజ్యం - 2, అవమానం - 4

మకరరాశి వారికి శుభకృత్ నామ సంవత్సరంలో
* గురుగ్రహ ఫలితాలు :- సంవత్సర ప్రారంభం నుండి ద్వితీయ భావంలో ఉండి 7 ఏప్రిల్ 2022 నుండి తృతీయ భావంలో సంచారం చేస్తాడు. ఇంట్లో వివాహాది శుభకార్య ప్రయత్నములు సఫలీకృతం అవుతాయి. మీ మాట నైపుణ్యం వలన పనులు సజావుగా సాగుతాయి. కొంత కుటుంబ సమస్యలు ఏర్పడుతాయి. ఆరోగ్యం కుడుటగా ఉండదు, వైద్యానికి, మాత్రలకు డబ్బు ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో కొంచం ఒడిదుడుకులు కనబడుతాయి.
* శని "దేవుని" గ్రహ ఫలితాలు:- ఏలినాటి శని నడుస్తున్నది. ఈ శని 29 మార్చి 2025 వరకు ప్రభావ ఫలితాలను చూపిస్తాయి. ఈ ఫలితాలు అనేవి మీ జీవిత భాగస్వామి మరియు సంతానానికి సంబంధించిన వారి వారి జాతకాలలోని గోచార స్థితిని బట్టి బలాబలాల ప్రభావం అనేది మీ జాతక ఫలితాలపై హెచ్చు తగ్గులుగా ప్రభావం తప్పకుండా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుత సంవత్సరంలో శని ఫిబ్రవరి 2023 వరకు జన్మరాశిలో సంచారం చేసి ఆ తర్వాత ద్వితీయ స్థానమైన కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. జన్మరాశి మరియు ద్వితీయ భావంలో ఉండగా ఫలితాలు పాత బాకీలు వసూలు కావు. అన్న దమ్ములతో , భాగస్వాములతో ఆస్తి పంపకం విషయంలో తగవులకు దారి తీస్తుంది. అపకీర్తి, అప్రదిష్టపాలయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. వృత్తి, వ్యాపారాల యందు ధన నష్టం చిక్కులు ఏర్పడుతాయి. ఏ పని చేయాలని తలపెట్టిన ఎక్కువ శ్రమ, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఎంత వద్దన్న బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో విరోదాలు సూచింప బడుతున్నాయి. పనులు ఆలస్యంగా కొనసాగుతాయి. తలిదండ్రులు లేకా కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
* రాహువు ఫలితాలు:- 5 ఏప్రిల్ 2022 నుండి చతుర్ధ భావంలో సంచారం కుటుంబ సభ్యులతో సమస్యలు, సహనం అవసరం. పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచలనలు ఉన్నాయి. స్థిరాస్తులు తనఖాకు పెట్టవలసిన అవసరం ఏర్పడే స్థితి గోచరిస్తుంది. ప్రయాణాలలో విఘ్నములు ఎదురవుతాయి.
* కేతువు ఫలితాలు:- 5 ఏప్రిల్ 2022 నుండి దశమ భావ సంచారం కంటే ముందు ఫలితాలు తలవని తలంపుగా తగువులు ఏర్పడే సూచనలు. చోర , రోగ, అగ్ని భయములు. దశమ భావ సంచారం ప్రారంభం అయిన నుండి వృత్తి, వ్యాపార అభివృద్ది. ధనలాభం, స్థిరాస్తులు కొంటారు. సరికొత్త పద్దతులలో ధన సంపాదన ఉంటుంది.
గురు గ్రహం ప్రభావం వల్ల ఈ ఏడాది ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు కనబడుతాయి.
శని గ్రహం ప్రతికూల ప్రభావంతో చిన్నారులకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ.
రాహువు వల్ల పెద్ద వయసు వారికి మతిమరుపు సమస్యలు పెరుగుతాయి.
కేతుగ్రహంతో మాత్రం శుభ ఫలితాలొస్తాయి.
మంచి వారితో స్నేహాలు చేయండి.
ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి.
ఏప్రిల్ మే నెల మాసాలు కాస్త ఇబ్బంది.
జూన్ జులై అద్భుతంగా వుంది.
శుభకార్యాలు జరుగుతాయి.
ఖర్చులు తగ్గించండి.
ఆడంబరాలకు దూరంగా ఉండండి, స్థిరాస్థులు కొనండి.
చెడు స్నేహాలు చేయకండి, వారే మీకు సంఘంలో అవమానాలు పెంచుతారు.
వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది.
ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వ్యాపారస్తులు నూతన వ్యాపారాని ప్రారంభిస్తారు.
రాజకీయనాయకులు ఉన్నత పదవి పొందే సూచలు ఉన్నాయి.
ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, ఆనారోగ్య సూచనలు ఎక్కువ గోచరిస్తున్నాయి.
విద్యార్ధులు ఎక్కువ శ్రమ పడితేనే ఉత్తమ ఫలితాలు పొందుతారు.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు ప్రతి రోజు రావిచెట్టుకు 11 సార్లు నిధానంగా " ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని స్మరిస్తూ ప్రదక్షిణ చేస్తే కష్టాల నుండి గట్టెక్కుతారు. ఇంట్లో, వ్యాపార సంస్థలలో ప్రధాన ద్వారం లోపలి వైపు గుమ్మం పై భాగంలో గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పటం భోజపత్ర యంత్ర యుక్తంగా ఉన్న పటాన్ని ఏర్పాటు చేసి రోజు ఎర్రని పూలతో నిష్టగా పూజిస్తే సకల సంపదలతో పాటు వాస్తు దోషం, దృష్టి దోష నివారణ కల్గుతుంది. గోమాతకు గ్రాసం, పక్షులకు ధాన్యం, త్రాగడానికి నీళ్ళను ఏర్పాటుచేసిన వారికి ఈతి బాధలు తొలగి గ్రహ అనుకూలతలు కలుగుతాయి... సర్వేజనా సుఖినో భవంతు, లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.. ఓం శాంతి శాంతి శాంతి: .. మీ ~ డా.ఎం.ఎన్.ఆచార్య
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications