ఆగస్టులో లక్ష్మీ నారాయణ యోగంతో నక్కతోక తొక్కే రాశులివే!
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఇతర గ్రహాలతో సంయోగం చెందుతూ, కొన్ని యోగాలను ఏర్పరుస్తాయి. ఇలా ఏర్పడే యోగాలు కొన్ని శుభ యోగాలు కాగా మరికొన్ని అశుభ యోగాలు.
లక్ష్మీ నారాయణ యోగం
గ్రహ మండలంలో బుధ శుక్ర గ్రహాల కలయికను అరుదైన కలయికగా భావిస్తారు. ఈ రెండు గ్రహాల కలయిక లక్ష్మీనారాయణ యోగాన్ని ఏర్పరుస్తుంది. ఆగస్టు 28వ తేదీన బుధ శుక్ర గ్రహాల కలయిక చంద్రుడు సొంత రాశి అయిన కర్కాటక రాశిలో ఏర్పడనుంది. కర్కాటక రాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం కొన్ని రాశులకు శుభాలను చేకూరుస్తుంది. లక్ష్మీ నారాయణ యోగం కారణంగా లబ్ధిని పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలు గడిస్తారు. కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది. ఈ సమయంలో మీరు కష్టాల నుంచి బయటపడతారు. వివాహాలు కానీ వారికి ఈ సమయంలో వివాహం అయ్యే యోగం ఉంది.
వృశ్చిక రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది. వీరికి గతం కంటే ఎక్కువ అవకాశాలు ఈ సమయంలో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సమయం వీరికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. ప్రతి రంగంలోనూ వీరు విజయాలను సాధిస్తారు. పూర్వీకుల నుండి ప్రయోజనాలను పొందుతారు. ఇది వృశ్చిక రాశి వారికి శుభాలను ఇచ్చే సమయం.
మీన రాశి
మీన రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం కారణంగా విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయాలను అందుకుంటారు. ఈ సమయంలో వీరి కెరీర్లో ఊహించని విధంగా పురోగతిని సాధిస్తారు. లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వీరు అనుభవించిన కష్టాలు తొలగిపోయి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఏ పని చేసిన మీన రాశి వారికి సక్సెస్ వచ్చి తీరుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications